రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ జులై 24 ( పున్నమి ప్రతినిధి)
రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చీటి సునీత–వెంకటనర్సింగరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అరటిపండ్లు, నోట్‌బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యాభ్యాసంలో రాణించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎదునూరి శ్రీనివాస్, 8వ వార్డు సభ్యుడు పుల్లూరి సంతోష్, ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ యువ నాయకుడు వంగూరి దిలీప్, పార్టీ నాయకులు బత్తిని మహేష్, చెక్కపెల్లి వెంకటేష్, కోడూరి మనీష్, పుల్లూరి నవీన్, మెరుగు వెంకటేష్ తదితరులు పాల్గొని కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.



