వార్త ముఖ్యాంశాలు
- గురుకులం లో ఘనముగా బాలల దినోత్సవం.
- తల్లీ తండ్రి కి దుశాలువతో ఘన సన్మానం.
- తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 14 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, పెదతాడేపల్లి గ్రామం లో వున్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు బాలల దినోత్సవం సందర్బంగా విద్యార్థుల తల్లీ తండ్రి ని ఆహ్వానించి పిల్లల చదువు వారి ఆరోగ్య పరిస్థితి వారి…
గురుకులం లో ఘనముగా బాలల దినోత్సవం. తల్లీ తండ్రి కి దుశాలువతో ఘన సన్మానం.
తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 14
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
నల్లజర్ల, పెదతాడేపల్లి గ్రామం లో వున్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు బాలల దినోత్సవం సందర్బంగా విద్యార్థుల తల్లీ తండ్రి ని ఆహ్వానించి పిల్లల చదువు వారి ఆరోగ్య పరిస్థితి వారి క్రమశిక్షణ విధానం వారి రోజు వారి ఆహారం మెనూ పరిసరాల శుభ్రం గూర్చి ఇవన్నీ కలిపి మంచి కార్యక్రమం ఎర్పాటు చేసి అందరికి వివరించి చెప్పారు. అలాగే ప్రతీ తల్లీ తండ్రి ని కూడా దుషాలువతో పూల బుకే ఇచ్చి ఘనము సత్కరించారు. ఇంతటి ఘనమైన కార్యక్రమం అద్భుతం గా చేశారు అందరు సంతోషించారు. అలాగే చక్కటి విద్య బుద్దులు నేర్పిస్తున్న హౌస్ టీచర్ ఆనంద్ ని విద్యార్థులు తల్లీ తండ్రి కూడా దుషాలువతో పూల బుకే తో ఘనంగా సత్కరించారు.. ఎంతో అనందించారు. ఈ విధంగా అందరికి స్కూల్ ప్రిన్సిపాల్ బి రాజారావు చక్కటి భోజనం ఎర్పాటు చేసారు కొంతసేపు విద్యార్థులు తల్లీ తండ్రి లతో గడిపారు పిల్లలు వారి యోగక్షేమలకోసం వివరించారు . ఈ విదంగా బాలల దినోత్సవం జరిగింది పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.