గుజరాత్ ప్రభుత్వం 2026–29 డేటా సెంటర్ పాలసీని ప్రకటిస్తూ రాష్ట్రాన్ని దేశంలో ప్రముఖ డిజిటల్ మౌలిక వసతుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అడుగులు వేసింది. ఈ పాలసీ ద్వారా సుమారు ₹6 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, 7.5 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. కృత్రిమ మేధస్సు (AI), క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ సేవల రంగాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం అందించేందుకు ప్రత్యేక రాయితీలు కల్పించనున్నారు. విద్యుత్ సబ్సిడీలు, మూలధన సబ్సిడీలు, స్టాంప్ డ్యూటీ మినహాయింపులు వంటి ప్రోత్సాహకాలు ఈ పాలసీలో ఉన్నాయి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో గుజరాత్‌ను అగ్రస్థానంలో నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.

గుజరాత్‌లో ₹6 లక్షల కోట్లతో డేటా సెంటర్ పాలసీకి శ్రీకారం