Wednesday, 22 April 2026
  • Home  
  • గిరిజన బాలికలకు గురుకులంలో ప్రవేశాలు
- తిరుపతి

గిరిజన బాలికలకు గురుకులంలో ప్రవేశాలు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 22 (పున్నమి న్యూస్( శ్రీకాళహస్తి తెలుగు గంగ కాలనీలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల అప్‌గ్రేడెడ్ పాఠశాల/జూనియర్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి 5వ నుండి 9వ తరగతుల వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ లలిత తెలిపారు. గిరిజన గురుకుల సంస్థ అమరావతి కార్యదర్శి ఆదేశాల మేరకు ఈ ప్రవేశ ప్రక్రియ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. తరగతి వారీగా 5వ తరగతిలో 51, 6వ తరగతిలో 26, 7వ తరగతిలో 11, 8వ తరగతిలో 1, 9వ తరగతిలో 6 సీట్లు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. ఈ ప్రవేశాలకు తిరుపతి జిల్లాకు చెందిన గిరిజన బాలికలకే అర్హత ఉందని స్పష్టం చేశారు. ఆసక్తి గల విద్యార్థినులు నేరుగా పాఠశాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు చేసిన వారికి జూన్ 15, 2026న ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని గిరిజన బాలికలు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.