Tuesday, 2 June 2026
  • Home  
  • గిరిజన కాలనీలో వీధిలైట్ల సమస్యపై అధికారుల నిర్లక్ష్యం-జనసేన పార్టీ మండిపాటు
- తిరుపతి

గిరిజన కాలనీలో వీధిలైట్ల సమస్యపై అధికారుల నిర్లక్ష్యం-జనసేన పార్టీ మండిపాటు

తొట్టంబేడు, జూన్ 03, (పున్నమి న్యూస్) తొట్టంబేడు మండలం పిల్లమేడు పంచాయతీ పరిధిలోని గిరిజన కాలనీలో నెలకొన్న వీధిలైట్ల సమస్యల పరిష్కారంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని జనసేన పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మే నెల 17వ తేదీన జనసేన నాయకులు ఈ కాలనీలో పర్యటించి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు ప్రధానంగా వీధిలైట్లు వెలగడం లేదని వారి దృష్టికి తీసుకురాగా, నాయకులు వెంటనే స్థానిక సచివాలయ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యపై పంచాయతీ కార్యదర్శి (సెక్రెటరీ) కి దాదాపు నాలుగు సార్లు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినప్పటికీ, అధికారులు కేవలం ఒకే ఒక్క లైటు వేసి చేతులు దులుపుకున్నారు. మిగిలిన వీధిలైట్లను ఎందుకు వేయలేదని జనసేన నాయకులు మరొకసారి గిరిజనులతో కలిసి సెక్రెటరీని గట్టిగా నిలదీశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి 15 రోజులు గడుస్తున్నా, మిగిలిన లైట్లను అమర్చకపోవడం గిరిజనుల పట్ల వారికున్న నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని, వెంటనే స్పందించి వీధిలైట్లు వేయాలని వారు డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.