Tuesday, 2 June 2026
  • Home  
  • వైసీపీకి డీఎస్సీ గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు-శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఘాటు విమర్శ
- తిరుపతి

వైసీపీకి డీఎస్సీ గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు-శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఘాటు విమర్శ

శ్రీ కాళహస్తి, జూన్ 03, (పున్నమి న్యూస్) కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామకాలపై వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వకుండా, ‘జాబ్ క్యాలెండర్’ పేరుతో నిరుద్యోగులను మోసగించిన వైసీపీ నేతలు నేడు డీఎస్సీపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకంతో కేవలం 148 రోజుల్లోనే 15,941 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించారని గుర్తుచేశారు. జగన్ రెడ్డి అండ్ కో ప్రోత్సాహంతో డీఎస్సీని అడ్డుకోవడానికి 241 కోర్టు కేసులు వేయించినప్పటికీ, ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా అత్యంత పారదర్శకంగా నియామకాలు పూర్తి చేసిందన్నారు. దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన ‘TCS iON’ సంస్థ ద్వారా ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించామని, రిజర్వేషన్ల అమలు, మెరిట్ జాబితాలను బహిరంగంగా వెబ్‌సైట్‌లో ఉంచడంతో కోర్టులు సైతం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని స్పష్టం చేశారు. కడప జిల్లాలో వైసీపీ నేతలు రవీంద్రనాథ్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ఆదిత్య రెడ్డి తదితరులు డీఎస్సీ పేరుతో దొంగ ధర్నాలు, రాజకీయ డ్రామాలకు తెరలేపడం వారి ఉనికి కోసం పడుతున్న పాట్లేనని ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను వంచించిన వైసీపీకి, ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత లేదని, వారి రాజకీయ అసూయను ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.