Saturday, 20 June 2026
  • Home  
  • గాలిగోపురం చెంత ఘనంగా ‘యోగాంధ్ర’ నిర్వహణ
- తిరుపతి

గాలిగోపురం చెంత ఘనంగా ‘యోగాంధ్ర’ నిర్వహణ

శ్రీ కాళహస్తి, జూన్ 19, (పున్నమి న్యూస్) : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి చారిత్రాత్మక గాలిగోపురం వద్ద శుక్రవారం ప్రత్యేక యోగా సాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొని కూటమి నాయకులు, కార్యకర్తలు, పురపాలక అధికారులు, యోగా సాధకులు, పట్టణ ప్రజలతో కలిసి వివిధ యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….యోగా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను పెంపొందించే ఉత్తమ జీవన విధానమని అన్నారు. నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలిలో ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడవచ్చని సూచించారు. పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు, అధికారులు మరియు నిర్వాహకులకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యోగా పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.