Saturday, 15 August 2026
  • Home  
  • గంగపేరూరు చిన్న చెరువులో ఆక్రమణల తొలగింపు 117 ఎకరాల చెరువు భూమికి విముక్తి
- కడప

గంగపేరూరు చిన్న చెరువులో ఆక్రమణల తొలగింపు 117 ఎకరాల చెరువు భూమికి విముక్తి

గంగపేరూరు చిన్న చెరువులో ఆక్రమణల తొలగింపు 117 ఎకరాల చెరువు భూమికి విముక్తి పున్నమి ప్రతినిధి, ఒంటిమిట్ట: గంగపేరూరు గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 150లో ఉన్న 117 ఎకరాల చిన్న చెరువు భూమిలో ఆక్రమణల తొలగింపు చేపట్టారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్‌ శాఖల అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. చెరువు భూమిలో అక్రమంగా ఏర్పాటు చేసిన పైప్‌లైన్లు, విద్యుత్‌ వైర్లను తొలగించడంతో పాటు మూడు జేసీబీలతో చెరువు కట్టలను తొలగించి నీటి ప్రవాహ మార్గాలను పునరుద్ధరించారు. నిబంధనలకు విరుద్ధంగా సాగు చేస్తున్న వరి, పసుపు పంటలను తొలగించి భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, మండలవ్యాప్తంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌తో ఆక్రమణల తొలగింపు చేపడతామని అధికారులు హెచ్చరించారు. అక్రమ సాగుదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. చెరువు భూమిని ఆక్రమణల నుంచి విముక్తి చేసి పూర్వపు స్థితికి తీసుకురావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

గంగపేరూరు చిన్న చెరువులో ఆక్రమణల తొలగింపు

117 ఎకరాల చెరువు భూమికి విముక్తి

పున్నమి ప్రతినిధి, ఒంటిమిట్ట: గంగపేరూరు గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 150లో ఉన్న 117 ఎకరాల చిన్న చెరువు భూమిలో ఆక్రమణల తొలగింపు చేపట్టారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్‌ శాఖల అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు.

చెరువు భూమిలో అక్రమంగా ఏర్పాటు చేసిన పైప్‌లైన్లు, విద్యుత్‌ వైర్లను తొలగించడంతో పాటు మూడు జేసీబీలతో చెరువు కట్టలను తొలగించి నీటి ప్రవాహ మార్గాలను పునరుద్ధరించారు. నిబంధనలకు విరుద్ధంగా సాగు చేస్తున్న వరి, పసుపు పంటలను తొలగించి భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, మండలవ్యాప్తంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌తో ఆక్రమణల తొలగింపు చేపడతామని అధికారులు హెచ్చరించారు. అక్రమ సాగుదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

చెరువు భూమిని ఆక్రమణల నుంచి విముక్తి చేసి పూర్వపు స్థితికి తీసుకురావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.