Wednesday, 19 August 2026
  • Home  
  • ఖమ్మం పర్యటనలో అభివృద్ధి ఎక్కడ..?* వ్యక్తిగత దూషణలే సీఎం ఎజెండా: వైరా నియోజకవర్గం నాయకులు బాదావత్ బాలాజీ నాయక్
- ఖమ్మం

ఖమ్మం పర్యటనలో అభివృద్ధి ఎక్కడ..?* వ్యక్తిగత దూషణలే సీఎం ఎజెండా: వైరా నియోజకవర్గం నాయకులు బాదావత్ బాలాజీ నాయక్

*ఖమ్మం పర్యటనలో అభివృద్ధి ఎక్కడ..?* వ్యక్తిగత దూషణలే సీఎం ఎజెండా: వైరా నియోజకవర్గం నాయకులు బాదావత్ బాలాజీ ఖమ్మం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త నిధుల ప్రకటనలు చేయకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌లపై వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యారని వైరా నియోజకవర్గం నాయకులు బాదావత్ బాలాజీ విమర్శించారు. ప్రజలు ముఖ్యమంత్రి పర్యటనల నుంచి అభివృద్ధి, ఉపాధి, రైతు సంక్షేమం, సాగునీరు, మౌలిక వసతులపై స్పష్టమైన నిర్ణయాలను ఆశిస్తున్నారని, కానీ ఖమ్మం పర్యటనలో రాజకీయ విమర్శలు తప్ప జిల్లాకు కొత్తగా ఒరిగిందేమీ లేదని ఆయన అన్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఖమ్మం జిల్లాకు వచ్చిన ప్రతిసారీ వందల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు ప్రకటించి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించారని గుర్తు చేశారు. ప్రస్తుతం అభివృద్ధి కంటే రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యమంత్రి పదవి గౌరవాన్ని తగ్గించే చర్యగా అభివర్ణించారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యాచరణ, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించాలని, వ్యక్తిగత దూషణల రాజకీయాలకు స్వస్తి పలకాలని వైరా నియోజకవర్గం నాయకులు బాదావత్ బాలాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

*ఖమ్మం పర్యటనలో అభివృద్ధి ఎక్కడ..?*
వ్యక్తిగత దూషణలే సీఎం ఎజెండా: వైరా నియోజకవర్గం నాయకులు బాదావత్ బాలాజీ

ఖమ్మం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త నిధుల ప్రకటనలు చేయకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌లపై వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యారని వైరా నియోజకవర్గం నాయకులు బాదావత్ బాలాజీ విమర్శించారు.
ప్రజలు ముఖ్యమంత్రి పర్యటనల నుంచి అభివృద్ధి, ఉపాధి, రైతు సంక్షేమం, సాగునీరు, మౌలిక వసతులపై స్పష్టమైన నిర్ణయాలను ఆశిస్తున్నారని, కానీ ఖమ్మం పర్యటనలో రాజకీయ విమర్శలు తప్ప జిల్లాకు కొత్తగా ఒరిగిందేమీ లేదని ఆయన అన్నారు.

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఖమ్మం జిల్లాకు వచ్చిన ప్రతిసారీ వందల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు ప్రకటించి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించారని గుర్తు చేశారు. ప్రస్తుతం అభివృద్ధి కంటే రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యమంత్రి పదవి గౌరవాన్ని తగ్గించే చర్యగా అభివర్ణించారు.
ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యాచరణ, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించాలని, వ్యక్తిగత దూషణల రాజకీయాలకు స్వస్తి పలకాలని వైరా నియోజకవర్గం నాయకులు బాదావత్ బాలాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

3 Comments

  1. Asuresh

    July 10, 2026

    మోతే పాఠశాలకు క్రీడా సామాగ్రి వితరణ

    వేల్పూర్ మండలంలోని మోతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల కొరకు మోతే పాఠశాల పూర్వ విద్యార్థి తొగటి భాస్కర్ 15 వేల రూపాయల విలువగల క్రీడా సామాగ్రిని అందజేశారు . మోతే విద్యార్థులు క్రీడలో బాగా రాణించాలని రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో పేరు సంపాదించాలని మరియు బాగా చదువుకుని గ్రామానికి పేరు తీసుకురావాలని తొగటి భాస్కర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థులు తోగటి భువెందర్ , మేర మహేష్, కే. భాస్కర్ , ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మంచి గణేష్ , మహేందర్, రత్నయ్య, వెంకట నరసయ్య , శ్రావణ శ్రీ , నవనీత, ఫిజికల్ డైరెక్టర్ సురేష్ కుమార్, మరియు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

  2. Asuresh

    July 10, 2026

    సురేష్ చారి

  3. Asuresh

    July 10, 2026

    బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.