విధులతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటుతూ ఆలేరు ఆరోగ్య ఉపకేంద్రం ఏ.ఎన్.ఎం. అలువాల నిరంజనమ్మ వైద్య ఆరోగ్యశాఖకు గర్వకారణంగా నిలిచారు. కల్వకుర్తి జెడ్పీ హైస్కూల్ మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఆమె షాట్‌పుట్‌లో గోల్డ్ మెడల్, డిస్కస్ త్రోలో సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఆమె మరిన్ని విజయాలు సాధించాలని భర్త శంకర్, గౌరెడ్డిపల్లి గ్రామస్తులు కోరారు. ఈ సందర్భంగా నిరంజనమ్మను జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి కుమార్ నాయక్, వైద్యాధికారి డాక్టర్ గుంపల్లి నాగేశ్వరి ప్రత్యేకంగా అభినందించారు.


