Wednesday, 9 September 2026
  • Home  
  • క్రిటికల్ కేర్ యూనిట్‌లో అదనపు కలెక్టర్ శ్రీజ పరిశీలన :
- ఖమ్మం

క్రిటికల్ కేర్ యూనిట్‌లో అదనపు కలెక్టర్ శ్రీజ పరిశీలన :

ఖమ్మం ఆగష్టు 11 (పున్నమి ప్రతినిధి) ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ యూనిట్‌ను అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ మంగళవారం పరిశీలించారు. యూనిట్‌లోని వసతులు, వైద్య సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన అదనపు వసతుల కోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రోగుల వెంట వచ్చే సహాయకులకు మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. అత్యవసర సేవల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ఖమ్మం ఆగష్టు 11
(పున్నమి ప్రతినిధి)

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ యూనిట్‌ను అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ మంగళవారం పరిశీలించారు. యూనిట్‌లోని వసతులు, వైద్య సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన అదనపు వసతుల కోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రోగుల వెంట వచ్చే సహాయకులకు మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. అత్యవసర సేవల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.