-కోవూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ. 5 లక్షల ప్రమాద బీమా చెక్కును ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అందజేశారు.
ప్రమాదంలో మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి రూ. 5 లక్షల బీమా చెక్కు అందజేశారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశంపార్టీ ధ్యేయం అని అన్నారు. కార్యకర్త కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కోవూరు శాసన సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. గురువారం నెల్లూరులోని వీపీఆర్ (VPR) కార్యాలయంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటంబానికి రూ. 5 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు.కొడవలూరు మండలం, నార్త్ రాజుపాలెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త షేక్ ఆయిషా అనే మహిళ ఈ ఏడాది మార్చి 16న కోవూరు సమీపంలో ఆటోలో ప్రయాణిస్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు, తెలుగుదేశం పార్టీ మంజూరు చేసిన రూ. 5 లక్షల ప్రమాద బీమాను మంజూరు చేసింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ.. పార్టీని నమ్ముకున్నప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ఆదుకుంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.


