పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని తరతాలా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల గిడ్డంగి బుధవారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి చెందగా, మరో పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్, భారత సైన్యం, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు. భారీ క్రేన్లు, గ్యాస్ కట్టర్లు ఉపయోగించి శిథిలాలను తొలగిస్తూ కార్మికులను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నిర్మాణ అనుమతుల్లో లోపాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోల్‌కతా మున్సిపల్ పరిధిలో జరుగుతున్న నిర్మాణాలన్నింటిపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న గిడ్డంగి కుప్పకూలి ఐదుగురు మృతి