Thursday, 4 June 2026
  • Home  
  • కోట ఎంపీపీ ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యం ఖూనీ: కాకాణి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోట ఎంపీపీ ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యం ఖూనీ: కాకాణి

కోట మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) ఉప ఎన్నికలో అధికార టీడీపీ ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కిందని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరిగ మురళి తదితరులతో కలిసి కోటలో పర్యటించిన ఆయన, ఈ రోజును “బ్లాక్ డే”గా అభివర్ణించారు. వైఎస్సార్‌సీపీ బీఫామ్‌పై గెలిచిన ఎంపీటీసీలను ప్రలోభాలు, బెదిరింపులతో తమవైపు తిప్పుకుని టీడీపీ అక్రమాలకు పాల్పడిందన్నారు. ప్రజా తీర్పును అవమానించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారని విమర్శించారు. కోట ఉప ఎన్నికల అక్రమాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.