నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను జిల్లా పోలీసు అధికారి సునీల్ షొరాణ్ ఐపీఎస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు,లాకప్ గదులు,స్టేషన్ నిర్వహణ,సిబ్బంది హాజరు వివరాలు,స్టేషన్ రికార్డులు,కేసు నమోదు తదితర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తు పురోగతిపై స్టేషన్ హౌస్ ఆఫీసర్ పై సమీక్ష నిర్వహించి,వాటిని త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అనంతరం స్టేషన్ పరిధిలోని గ్రామాల పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు,శాంతిభద్రతల పరిస్థితి,గ్రామాల్లో పోలీసింగ్ విధానం తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన,పారదర్శకమైన పోలీసు సేవలు అందేలా ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.అనంతరం జానాలగూడెం చెంచు గ్రామాన్ని స్వయంగా సందర్శించిన జిల్లా ఎస్పీ గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో ఐకమత్య వాతావరణాన్ని కొనసాగిస్తూ ఎలాంటి గొడవలు,వివాదాలకు తావు ఇవ్వకుండా పరస్పర సహకారంతో జీవించాలని,పిల్లలకు ఉన్నత విద్యను అందించి వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా ప్రతి కుటుంబసభ్యులు కృషి చేయాలని అవగాహన కల్పించారు. అనంతరం పాత్రికేయులతో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ “ప్రజల భద్రత,శాంతిభద్రతల పరిరక్షణే నంద్యాల జిల్లా పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని,జిల్లా ప్రజలకు పోలీసు సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని,ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు జిల్లా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్,ఐపీఎస్ తెలిపారు.



