కొత్తపల్లిలో రేణుక ఎల్లమ్మకు ఘనంగా బోనం సమర్పణ
కొత్తపల్లి: గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించారు. బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం అధ్యక్షులు ఆడాల జంగయ్య, ఉపాధ్యక్షులు ఆడాల వెంకటయ్యతో పాటు సంఘం సభ్యులు ఆడాల నడిపి యాదయ్య, ఆడాల బుచ్చయ్య, పెద్ద యాదయ్య, నెల్లుట్ల లక్ష్మయ్య, చిన్న వెంకటయ్య, నాగరాజు, చంద్రయ్య, చిన్న యాదయ్య, చిన్న నరసింహ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమ్మవారి కృపాకటాక్షాలతో కొత్తపల్లి గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.
– కాలె అనిత–రమేష్
కొత్తపల్లి గ్రామ ఉపసర్పంచ్



