వెంకటగిరి ( *పున్నమి న్యూస్ ప్రతినిధి* ) ఆగస్టు 21 తిరుపతి జిల్లా వెంకటగిరి,నియోజకవర్గంసమన్వకర్త
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండూరు వెంకటరత్నం రాజు పొలాల్లో పడి చేయి కి గాయం జరిగింది. శస్త్ర చికిత్స చేయించుకుని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈమేరకు,సమాచారం అందుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డివెంకటరత్నం రాజు నివాసం చేరుకొని ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆందోళన చందొద్దని వైద్యుల సూచన మేరకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వారి వెంట వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు



