సంగీత ప్రేరణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
విశాఖపట్నం జిల్లా, ఆనందపురం, సెప్టెంబర్ 11 :
ఆనందపురంలోని లొడగలవానిపాలెం పంచాయతీ నెల్తేరు గ్రామంలో **కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)**లో సంగీత ప్రేరణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, మహిళల ఆరోగ్యం, రుతుస్రావ పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి , మాజీ మంత్రివర్యులు, భీమునిపట్నం నియోజకవర్గం MLA గారు గౌరవనీయులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహనతో పాటు విద్యలో రాణించి, నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్న ఫౌండేషన్‌ను ఆయన అభినందించారు.
విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన
మహాత్మా గాంధీ క్యాన్సర్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ పి. మాధురి విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, ముఖ్యంగా బాలికల ఆరోగ్యం, రుతుస్రావ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమం అనంతరం విద్యార్థినులు, తల్లిదండ్రులతో ప్రత్యేకంగా ముచ్చటించి వారి సందేహాలను నివృత్తి చేశారు.
ఈ సందర్భంగా సంగీత ప్రేరణ వికాస్ ఫౌండేషన్ తరఫున విద్యార్థినులకు ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడంతో పాటు అవసరమైన పరిశుభ్రత ఉత్పత్తులను అందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఫౌండేషన్ ట్రస్టీలు హర్షిణి, రోషిణి తెలిపారు.
కేజీబీవీకి సుభాష్ చంద్రబోస్ గారి సేవలకు ఎమ్మెల్యే గారు అభినందన
కేజీబీవీ ఆనందపురం పాఠశాలను దత్తత తీసుకుని, విద్యార్థినులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిరంతరం అండగా నిలుస్తున్న శ్రీ ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్ సేవలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు ప్రత్యేకంగా అభినందించారు.
బాలికల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన నూతన టాయిలెట్లు, దోబీకాట్, డైనింగ్ హాల్, బంకర్ బెడ్స్, Kitchen garden, Paintingsతదితర మౌలిక వసతులను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు పరిశీలించారు. విద్యార్థుల సౌకర్యాలు, పాఠశాల అభివృద్ధికి మరింత సహకారం అందిస్తామని తెలిపారు.
సాంస్కృతిక కార్యక్రమాలకు రూ.లక్ష విరాళం
విద్యార్థుల్లో సాంస్కృతిక ప్రతిభను ప్రోత్సహించేందుకు శ్రీ ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్ రూ.1 లక్షను ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు గారు చేతుల మీదుగా అందజేశారు. అలాగే కేజీబీవీలోని విద్యార్థులందరికీ భోజన ప్లేట్లను అందజేశారు.
ఇంగ్లీషు భాషలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ బ్లేజర్లను కూడా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు.
విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి
సంగీత ప్రేరణ వికాస్ ఫౌండేషన్‌ను కుటుంబ సభ్యుల తల్లి సంగీత జ్ఞాపకార్థం ప్రారంభించినట్లు ట్రస్టీలు హర్షిణి, రోషిణి తెలిపారు. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, మానసిక ఆరోగ్యం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ అవసరమైన ప్రాంతాలకు నేరుగా చేరుకోవడం ఫౌండేషన్ లక్ష్యమన్నారు.
భవిష్యత్తులో అవగాహన కార్యక్రమాలతో పాటు కెరీర్ గైడెన్స్, మోటివేషన్, విద్యార్థులతో ప్రత్యక్ష పరస్పర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కేవలం కార్యక్రమాలు నిర్వహించడం కాకుండా అవసరమైన ప్రాంతాల్లో వాస్తవమైన మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమని వెల్లడించారు.
ప్రముఖుల హాజరు
కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ గంటా రవి తేజ గారు,శ్రీ ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్ గారు, ఏపిసి డాక్టర్ జె. చంద్రశేఖర్ గారు,ఎం.ఆర్.ఓ ఎస్. శ్రీనుబాబు గారు, ఎంఈఓ జోగేంద్రనాథ్ గారు, కెజిబివి ఆనందపురం ప్రిన్సిపాల్ దొండా చంద్రకళ గారు, వైస్ ప్రిన్సిపల్ బి నాగమణి గారు,కేజీబీవీ పేరెంట్స్ కమిటీ చైర్మన్ కోరుకొండ శివాజీ గారు, మండల ముఖ్య నాయకులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు,తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గారు, వక్తలు,సంగీత ప్రేరణ వికాస్ ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు.


















