Saturday, 12 September 2026
  • Home  
  • వినాయక చవితి వేడుకల్లో అప్రమత్తత అవసరం: సీఐ గంగాధర్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వినాయక చవితి వేడుకల్లో అప్రమత్తత అవసరం: సీఐ గంగాధర్

ఆత్మకూరు: వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆత్మకూరు సీఐ జి. గంగాధర్ ప్రజలకు సూచించారు. పండుగ సందర్భంగా ప్రజలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. వినాయక విగ్రహాల ఏర్పాటుకు సంబంధిత అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. మండపాల ఏర్పాటుతో ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. విద్యుత్, అగ్నిమాపక శాఖల సూచనలను తప్పనిసరిగా అమలు చేయాలని తెలిపారు. మండపాల వద్ద నిర్వాహకుల్లో ఎవరో ఒకరు అందుబాటులో ఉండాలని సూచించారు. మండపాల వద్ద, నిమజ్జన సమయంలో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎలాంటి గొడవలు, వివాదాలకు తావులేకుండా సంయమనం పాటించి పండుగను ఆనందంగా నిర్వహించుకోవాలని సీఐ గంగాధర్ కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.