Tuesday, 15 July 2025
  • Home  
  • కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే హక్కు వైసీపీ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?*
- Featured

కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే హక్కు వైసీపీ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?*

  *25 ఏళ్లలీజు ముసుగులో దేశంలోనే పర్యావరణహితమైన ప్రాజెక్టుగా పేరుపొందిన థర్మల్ ప్లాంటును అదానీ పరంచేస్తే ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం.* *ఈ పవర్ ప్లాంట్ పరిస్థితిపై ఏనాడైనా విద్యుత్ శాఖ మంత్రి ఒక్క గంటైనా సమీక్ష చేశారా?* *థర్మల్ పవర్ ప్లాంటుకు ఆస్ట్రేలియా నుంచి 4లక్షల టన్నుల మట్టిబొగ్గు సరఫరా చేసింది అరబిందో కంపెనీ వారికి చెందిన నాలెడ్జ్ కంపెనీ కాదా?* *మట్టితో కూడిన బొగ్గుని సరఫరా చేసిన కంపెనీపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు?* *ఆ కంపెనీనుంచి బొగ్గు సరఫరా చేసుకోవాలని చెప్పిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?* *సీఎం ఆదేశాలతో విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ అంతాతానై వ్యవహరిస్తున్నారు* *సీఎం మెప్పు కోసం షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ యాజమాన్యం చెప్పిందల్లా వింటూ శ్రీకాంత్ విద్యుత్ రంగాన్ని నాశనం చేస్తున్నారు* *షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ యాజమాన్యం షాడో విద్యుత్ మంత్రిగా వ్యవహరిస్తోంది* *అమరావతిలో మీడియాతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి* 2400 మెగావాట్ల సామర్థ్యంతో శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (కృష్ణపట్నం సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్) ను చేపట్టారు తొలి యూనిట్ 800మెగావాట్ల సామర్థ్యంతో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలైతే, రెండో యూనిట్ 800మెగావాట్ల సామర్థ్యంతో టీడీపీ హయాంలో చంద్రబాబునాయుడు ప్రారంభించారు కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ దేశంలోనే తొలి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ లో, తొలిరెండుదశల్లో 1600యూనిట్ల చొప్పున థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. మూడో యూనిట్ పనులు 97శాతం వరకు పూర్తయ్యాయి. 1200 ఎకరాల్లో రూ.21వేల కోట్ల పెట్టుబడితో గత ప్రభుత్వాలు, సీఎంలు, ఎంతో ప్రతిష్టాత్మకమైన థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుచేస్తే, ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ పరం చేస్తామని చెప్పడం అన్యాయం అదానీ సంస్థకు కృష్ణపట్నం పోర్టును అప్పగించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు థర్మల్ పవర్ స్టేషన్ కూడా ధారాధత్తం చేయడానికి సిద్ధమయ్యారు. 400 మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా పనిచేస్తుండగా, 1200 మంది పరోక్షంగా దానిపై ఆధారపడి జీవిస్తున్నారు. కనస్ట్రక్షన్ ఉద్యోగులతో కలిపి దాదాపు 3వేలమంది బతుకులు ప్రాజెక్టుపై ఆధారపడిఉన్నాయి. ఇంతటి కీలక పవర్ ప్రాజెక్ట్ ని ప్రైవేట్ పరం చేసే హక్కు, ఈ ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు? విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న వారు, దానితో సరిసమానమైన కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్ ను ఎలా ప్రైవీటీకరిస్తారు బొగ్గు నిల్వలు సరిపడా నిల్వచేసుకోకుండా, థర్మల్ ప్లాంట్ నిర్వహించలేమని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటు. కేంద్ర ప్రభుత్వం 10 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు థర్మల్ పవర్ ప్లాంట్లలో పెట్టుకోవాలని రాష్ట్రాలకు చెబితే, ఏపీ ప్రభుత్వం రెండు, మూడు రోజుల నిల్వలు కూడా ఉంచలేని స్థితిలో ఎందుకుంది బొగ్గు నిల్వలకు ప్రభుత్వం ఏటా రుసుము చెల్లించాలి. అది చేయలేకనే బొగ్గు నిల్వ చేసుకోలేకపోతున్నారా? కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ ను అదానీ పరంచేయడానికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బంది కాదా? 2020 జనవరిలో ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్న 4 లక్షల టన్నుల బొగ్గు మట్టితో కూడి ఉందని, దాంతో విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదని అప్పట్లోనే కార్మికులంతా ధర్నాకు దిగారు. అయినా వినిపించుకోకుండా ఆ బొగ్గుని విద్యుత్ వినియోగానికి వాడారు. ఉద్యోగులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలపడంతో పెడుతున్నారని లక్ష టన్నులు మాత్రమే వినియోగించలేదు. ఎర్రమట్టి కలిసిన లక్ష టన్నుల బొగ్గు ఇప్పటికీ అలానే నిల్వఉంది. దాన్ని సగం ధరకు కూడా ఈప్రభుత్వం అమ్మలేకపోయింది. ఆస్ట్రేలియా నుంచి ఆనాడు దిగుమతి అయిన బొగ్గు నాలెడ్జ్ కంపెనీ నుంచి వచ్చింది. ఆ నాలెడ్జ్ కంపెనీ విజయసాయిరెడ్డికి చెందిన అరబిందో పరిశ్రమకు చెందినది. సీఎం తన బంధువులకు మేలు చేయడం కోసం ఆఖరికి థర్మల్ ప్లాంట్ నే మూతపడేసేందుకు దిగజారాడు. దాని విలువ సుమారు రూ.700 కోట్లు, ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంటుపై ఒక గంట పాటు సమీక్ష చేసే స్థితిలోకూడా విద్యుత్ శాఖ మంత్రి లేరా? విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ సీఎం ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటూ, అంతాతానై వ్యవహరిస్తున్నాడు. ఆఖరికి ట్రాన్స్ ఫార్మర్లు కావాలన్నా శ్రీకాంత్ అనుమతి కావాల్సిందే. ఒక రెడ్డి గారికి చెందిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ పెత్తనం సాగుతోంది సదరు కంపెనీ యజమాని సిఫార్సుతో మూడు ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్ విభాగాలకు రిటైరైన వ్యక్తులను తీసుకొచ్చి, పదవులు కట్టబెట్టారు. విజయవాడలోని సీపీడీసీఎల్ సీఎండీ పద్మా జనార్థన్ రెడ్డి వైసీపీ నేత బంధువు కాదా? ట్రాన్స్ ఫార్మర్లు, మీటర్లు, ఫ్యూజులు సహా అన్నీ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ నుంచే వస్తున్నాయి. వెయ్యి రూపాయలుండే సింగిల్ ఫేజ్ మీటరును షిర్డీసాయినుంచి రూ.1500లకు పవర్ జనరేషన్ కంపెనీలు కొనాలా? రూ.1,30,000 విలువైన ట్రాన్స్ ఫార్మర్ ని , రూ.1,75,000లకు కొనాలా? రూ.10వేల విలువైన ఫీజ్ సెట్ బాక్స్ స్థానంలో టెక్నాలజీపేరుతో ఎంసీబీ బాక్స్ లని పెట్టారు. దాన్ని రూ.30వేలకు కొంటున్నారు. ఇలా చెప్పుకుంటూపోతే చాలా ఉన్నాయి. వీటన్నింటినీ ముందు సీపీడీసీఎల్ ఎండీ పద్మాజనార్థన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తారు ఆ తరువాత రాష్ట్రమంతా అమలయ్యేలా చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలో షాడో ఎలక్ట్రిసిటీ మంత్రిగా షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ యాజమాన్యం వ్యవహరిస్తోంది. రాష్ట్ర విద్యుత్ రంగం సర్వనాశనమయ్యేలా వారు ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. అంతా ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు చేసేటప్పుడు, ఇక ప్రభుత్వం దేనికుందని ప్రశ్నిస్తున్నాం? సీలేరులోని హైడ్రోపవర్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ కు కూడా రివర్స్ టెండర్లు పిలవండి. ఎవరు తక్కువధరకు హైడ్రోపవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తిచేసి, ఎన్ని సంవత్సరాలకు పవర్ ఉత్పత్తిచేస్తారో ఆలోచించి టెండర్లు పిలవండి. పెట్టుబడి పెట్టలేని ప్రభుత్వం థర్మ ల్ పవర్ స్టేషన్లను ప్రైవేట్ పరం చేసుకుంటూపోతే, చివరకు రాష్ట్రం చీకట్లలో మగ్గడంఖాయం. పోలవరంలోని హైడల్ పవర్ ప్రాజెక్ట్ నవయుగకంపెనీకి వస్తే, దాన్ని రద్దుచేసి ఈ ముఖ్యమంత్రి రివర్స్ టెండర్లు పిలిచాడు. నవయుగ కంపెనీ పెట్టుబడులు పెట్టాక, ప్రభుత్వం రూ.500కోట్లు వెచ్చించాక, ఆ.కంపెనీ టెండర్లు రద్దు చేశారు. టెండర్ల రద్దుతో ప్రభుత్వానికి వచ్చిన రూ.300 కోట్ల నష్టాన్ని ఎవరు బరిస్తారు? ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మట్టిబొగ్గు కారణంగా వచ్చిన రూ.700 కోట్లు, విద్యుత్ ఉత్పత్తి నిలిచిన కారణంగా వాటిల్లిన వేల కోట్ల నష్టాన్ని ఎవరు బరిస్తారు ఇలా అనేక పాపాలు ఈ ప్రభుత్వ నిర్వాకంతో జరగలేదా? ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తిచేయాలంటే 0.5శాతం ఉద్యోగులు కావాలి. కానీ కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్లో 0.2కంటే తక్కువమంది ఉద్యోగులే ఉత్పత్తిచేస్తున్నారు. కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ దేశానికే మోడల్. అలాంటి కంపెనీని అదానీ పరంచేస్తామంటే ఊరుకోం..తాడోపేడో తేల్చుకోవడానికే సిద్ధంగా ఉన్నాం 25 ఏళ్లపాటు లీజు అని పైకిచెబుతూ థర్మల్ పవర్ స్టేషన్ ని అదానీ సంస్థ పరం చేయాలనిచూస్తే ఊరుకునేదిలేదని హెచ్చరిస్తున్నాం. 25 ఏళ్ల తర్వాత థర్మల్ ప్లాంట్ మొత్తం తుక్కుతుక్కుఅయితే అప్పుడుఎవరు బాధ్యత తీసుకుం టారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం, ఎన్నో ఏళ్లుగా రాష్ట్రానికి మేలుచేస్తున్న కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంటును ఎలా ప్రైవేట్ పరంచేస్తుంది?

 

*25 ఏళ్లలీజు ముసుగులో దేశంలోనే పర్యావరణహితమైన ప్రాజెక్టుగా పేరుపొందిన థర్మల్ ప్లాంటును అదానీ పరంచేస్తే ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం.*

*ఈ పవర్ ప్లాంట్ పరిస్థితిపై ఏనాడైనా విద్యుత్ శాఖ మంత్రి ఒక్క గంటైనా సమీక్ష చేశారా?*

*థర్మల్ పవర్ ప్లాంటుకు ఆస్ట్రేలియా నుంచి 4లక్షల టన్నుల మట్టిబొగ్గు సరఫరా చేసింది అరబిందో కంపెనీ వారికి చెందిన నాలెడ్జ్ కంపెనీ కాదా?*

*మట్టితో కూడిన బొగ్గుని సరఫరా చేసిన కంపెనీపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు?*

*ఆ కంపెనీనుంచి బొగ్గు సరఫరా చేసుకోవాలని చెప్పిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?*

*సీఎం ఆదేశాలతో విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ అంతాతానై వ్యవహరిస్తున్నారు*

*సీఎం మెప్పు కోసం షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ యాజమాన్యం చెప్పిందల్లా వింటూ శ్రీకాంత్ విద్యుత్ రంగాన్ని నాశనం చేస్తున్నారు*

*షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ యాజమాన్యం షాడో విద్యుత్ మంత్రిగా వ్యవహరిస్తోంది*

*అమరావతిలో మీడియాతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

2400 మెగావాట్ల సామర్థ్యంతో శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (కృష్ణపట్నం సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్) ను చేపట్టారు

తొలి యూనిట్ 800మెగావాట్ల సామర్థ్యంతో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలైతే, రెండో యూనిట్ 800మెగావాట్ల సామర్థ్యంతో టీడీపీ హయాంలో చంద్రబాబునాయుడు ప్రారంభించారు

కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ దేశంలోనే తొలి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్

కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ లో, తొలిరెండుదశల్లో 1600యూనిట్ల చొప్పున థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు.

మూడో యూనిట్ పనులు 97శాతం వరకు పూర్తయ్యాయి.

1200 ఎకరాల్లో రూ.21వేల కోట్ల పెట్టుబడితో గత ప్రభుత్వాలు, సీఎంలు, ఎంతో ప్రతిష్టాత్మకమైన థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుచేస్తే, ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ పరం చేస్తామని చెప్పడం అన్యాయం

అదానీ సంస్థకు కృష్ణపట్నం పోర్టును అప్పగించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు థర్మల్ పవర్ స్టేషన్ కూడా ధారాధత్తం చేయడానికి సిద్ధమయ్యారు.

400 మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా పనిచేస్తుండగా, 1200 మంది పరోక్షంగా దానిపై ఆధారపడి జీవిస్తున్నారు.

కనస్ట్రక్షన్ ఉద్యోగులతో కలిపి దాదాపు 3వేలమంది బతుకులు ప్రాజెక్టుపై ఆధారపడిఉన్నాయి.

ఇంతటి కీలక పవర్ ప్రాజెక్ట్ ని ప్రైవేట్ పరం చేసే హక్కు, ఈ ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు?

విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న వారు, దానితో సరిసమానమైన కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్ ను ఎలా ప్రైవీటీకరిస్తారు

బొగ్గు నిల్వలు సరిపడా నిల్వచేసుకోకుండా, థర్మల్ ప్లాంట్ నిర్వహించలేమని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటు.

కేంద్ర ప్రభుత్వం 10 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు థర్మల్ పవర్ ప్లాంట్లలో పెట్టుకోవాలని రాష్ట్రాలకు చెబితే, ఏపీ ప్రభుత్వం రెండు, మూడు రోజుల నిల్వలు కూడా ఉంచలేని స్థితిలో ఎందుకుంది

బొగ్గు నిల్వలకు ప్రభుత్వం ఏటా రుసుము చెల్లించాలి. అది చేయలేకనే బొగ్గు నిల్వ చేసుకోలేకపోతున్నారా?

కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ ను అదానీ పరంచేయడానికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసేసుకున్నాడు.

జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బంది కాదా?

2020 జనవరిలో ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్న 4 లక్షల టన్నుల బొగ్గు మట్టితో కూడి ఉందని, దాంతో విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదని అప్పట్లోనే కార్మికులంతా ధర్నాకు దిగారు.

అయినా వినిపించుకోకుండా ఆ బొగ్గుని విద్యుత్ వినియోగానికి వాడారు.

ఉద్యోగులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలపడంతో పెడుతున్నారని లక్ష టన్నులు మాత్రమే వినియోగించలేదు.

ఎర్రమట్టి కలిసిన లక్ష టన్నుల బొగ్గు ఇప్పటికీ అలానే నిల్వఉంది.

దాన్ని సగం ధరకు కూడా ఈప్రభుత్వం అమ్మలేకపోయింది.

ఆస్ట్రేలియా నుంచి ఆనాడు దిగుమతి అయిన బొగ్గు నాలెడ్జ్ కంపెనీ నుంచి వచ్చింది.

ఆ నాలెడ్జ్ కంపెనీ విజయసాయిరెడ్డికి చెందిన అరబిందో పరిశ్రమకు చెందినది.

సీఎం తన బంధువులకు మేలు చేయడం కోసం ఆఖరికి థర్మల్ ప్లాంట్ నే మూతపడేసేందుకు దిగజారాడు.

దాని విలువ సుమారు రూ.700 కోట్లు, ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు

కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంటుపై ఒక గంట పాటు సమీక్ష చేసే స్థితిలోకూడా విద్యుత్ శాఖ మంత్రి లేరా?

విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ సీఎం ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటూ, అంతాతానై వ్యవహరిస్తున్నాడు.

ఆఖరికి ట్రాన్స్ ఫార్మర్లు కావాలన్నా శ్రీకాంత్ అనుమతి కావాల్సిందే.

ఒక రెడ్డి గారికి చెందిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ పెత్తనం సాగుతోంది

సదరు కంపెనీ యజమాని సిఫార్సుతో మూడు ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్ విభాగాలకు రిటైరైన వ్యక్తులను తీసుకొచ్చి, పదవులు కట్టబెట్టారు.

విజయవాడలోని సీపీడీసీఎల్ సీఎండీ పద్మా జనార్థన్ రెడ్డి వైసీపీ నేత బంధువు కాదా?

ట్రాన్స్ ఫార్మర్లు, మీటర్లు, ఫ్యూజులు సహా అన్నీ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ నుంచే వస్తున్నాయి.

వెయ్యి రూపాయలుండే సింగిల్ ఫేజ్ మీటరును షిర్డీసాయినుంచి రూ.1500లకు పవర్ జనరేషన్ కంపెనీలు కొనాలా?

రూ.1,30,000 విలువైన ట్రాన్స్ ఫార్మర్ ని , రూ.1,75,000లకు కొనాలా?

రూ.10వేల విలువైన ఫీజ్ సెట్ బాక్స్ స్థానంలో టెక్నాలజీపేరుతో ఎంసీబీ బాక్స్ లని పెట్టారు. దాన్ని రూ.30వేలకు కొంటున్నారు.

ఇలా చెప్పుకుంటూపోతే చాలా ఉన్నాయి. వీటన్నింటినీ ముందు సీపీడీసీఎల్ ఎండీ పద్మాజనార్థన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తారు

ఆ తరువాత రాష్ట్రమంతా అమలయ్యేలా చేస్తున్నారు.

ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలో షాడో ఎలక్ట్రిసిటీ మంత్రిగా షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ యాజమాన్యం వ్యవహరిస్తోంది.

రాష్ట్ర విద్యుత్ రంగం సర్వనాశనమయ్యేలా వారు ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు.

అంతా ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు చేసేటప్పుడు, ఇక ప్రభుత్వం దేనికుందని ప్రశ్నిస్తున్నాం?

సీలేరులోని హైడ్రోపవర్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ కు కూడా రివర్స్ టెండర్లు పిలవండి.

ఎవరు తక్కువధరకు హైడ్రోపవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తిచేసి, ఎన్ని సంవత్సరాలకు పవర్ ఉత్పత్తిచేస్తారో ఆలోచించి టెండర్లు పిలవండి.

పెట్టుబడి పెట్టలేని ప్రభుత్వం థర్మ ల్ పవర్ స్టేషన్లను ప్రైవేట్ పరం చేసుకుంటూపోతే, చివరకు రాష్ట్రం చీకట్లలో మగ్గడంఖాయం.

పోలవరంలోని హైడల్ పవర్ ప్రాజెక్ట్ నవయుగకంపెనీకి వస్తే, దాన్ని రద్దుచేసి ఈ ముఖ్యమంత్రి రివర్స్ టెండర్లు పిలిచాడు.

నవయుగ కంపెనీ పెట్టుబడులు పెట్టాక, ప్రభుత్వం రూ.500కోట్లు వెచ్చించాక, ఆ.కంపెనీ టెండర్లు రద్దు చేశారు.

టెండర్ల రద్దుతో ప్రభుత్వానికి వచ్చిన రూ.300 కోట్ల నష్టాన్ని ఎవరు బరిస్తారు?

ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మట్టిబొగ్గు కారణంగా వచ్చిన రూ.700 కోట్లు, విద్యుత్ ఉత్పత్తి నిలిచిన కారణంగా వాటిల్లిన వేల కోట్ల నష్టాన్ని ఎవరు బరిస్తారు

ఇలా అనేక పాపాలు ఈ ప్రభుత్వ నిర్వాకంతో జరగలేదా?

ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తిచేయాలంటే 0.5శాతం ఉద్యోగులు కావాలి. కానీ కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్లో 0.2కంటే తక్కువమంది ఉద్యోగులే ఉత్పత్తిచేస్తున్నారు.

కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ దేశానికే మోడల్. అలాంటి కంపెనీని అదానీ పరంచేస్తామంటే ఊరుకోం..తాడోపేడో తేల్చుకోవడానికే సిద్ధంగా ఉన్నాం

25 ఏళ్లపాటు లీజు అని పైకిచెబుతూ థర్మల్ పవర్ స్టేషన్ ని అదానీ సంస్థ పరం చేయాలనిచూస్తే ఊరుకునేదిలేదని హెచ్చరిస్తున్నాం.

25 ఏళ్ల తర్వాత థర్మల్ ప్లాంట్ మొత్తం తుక్కుతుక్కుఅయితే అప్పుడుఎవరు బాధ్యత తీసుకుం టారు?

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం, ఎన్నో ఏళ్లుగా రాష్ట్రానికి మేలుచేస్తున్న కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంటును ఎలా ప్రైవేట్ పరంచేస్తుంది?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.