*శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ లోని కూకట్పల్లి చిత్తారమ్మ దేవాలయం నందు సిఎంసి అధికారులు డివైన్ వేస్ట్ కలెక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ గౌరవ సృజన మేడం గారు, అడిషనల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి గారు, జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ గారు,డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి గారు,మాజీ కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి గారు, మాధవరం రంగారావు గారు, జూపల్లి సత్యనారాయణ గారు పాల్గొన్నారు.*
*సిఎంసి కమిషనర్ సృజన గారు మరియు మాజీ కార్పొరేటర్ రోజా దేవి గారు మాట్లాడుతూ చెరువులు, కాలువల్లో పూజకు పనికిరాని దేవుని చిత్రాలను వేయడం వల్ల నీటి వనరులు కలుషితమవుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సిఎంసి ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ప్రతి నెల ఒక శనివారం రోజున ఇలాంటి పాత, విచ్ఛిన్నమైన దేవుని చిత్రాలను సిఎంసి సిబ్బంది సేకరించి, సాంప్రదాయబద్ధంగా గౌరవప్రదంగా తొలగించి రీసైక్లింగ్‌కు పంపించనున్నారని ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి సహకరించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.*
*ఈ కార్యక్రమంలో స్థానిక వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కాలనీల వాసులు తదితరులు పాల్గొన్నారు.*


