Sunday, 12 July 2026
  • Home  
  • కులాల మధ్య చిచ్చే దళిత క్రైస్తవ శంఖారావం సభ… జడ శ్రవణ్ పై అళహరి సుధాకర్‌ ఆగ్రహం
- ఆంధ్రప్రదేశ్

కులాల మధ్య చిచ్చే దళిత క్రైస్తవ శంఖారావం సభ… జడ శ్రవణ్ పై అళహరి సుధాకర్‌ ఆగ్రహం

జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో (జూలై పున్నమి) మతాల మధ్య చిచ్చు పెట్టాలి.. దానిలో చలి కాచుకోవాలి. కులాల మధ్య కుంపట్లు పెట్టాలి… వికృతానందం పొందాలి. ఇదే వైసీపీ రాష్ట్రంలో పోషిస్తున్న ప్రతిపక్ష పాత్ర. జడ శ్రవణ్ అయినా, ప్రశ్న రావణ్ అయినా తాడేపల్లి ప్యాలెస్ నుంచి పట్టాలు పొందినవాళ్లే. వీరందరినీ పెంచి పోషిస్తోంది వైసీపీ పార్టీయే’ అని జనసేన పార్టీ కావలి కార్యాలయములో జరిగిన ప్రెస్ మీట్ లో కావలి ‌సీనియర్ జనసేన నేత అళహరి సుధాకర్ అన్నారు. యూట్యూబర్ రావణ్ కు వైసీపీ న్యాయపరంగా సాయం చేస్తామని చెప్పడం ద్వారా వీరి బంధం ప్రజలకు బహిరంగంగా తెలిసిందన్నారు. ‘‘అవినీతి కేసుల్లో ఉద్యోగం పోగొట్టుకొని, సమాజంలో అలజడులు సృష్టించడం ద్వారా పబ్బం గడుపుకోవాలని చూస్తున్న జడా శ్రవణ్ కు – ప్రజల కోసం నిత్యం పని చేస్తున్న పవన్ కళ్యాణ్ ని విమర్శించే నైతిక హక్కు లేదు అని. గత ఎన్నికల్లో తెదేపా అధినేత చంద్రబాబు ని రూ.25 కోట్లు, 5 సీట్లు ఇవ్వాలని అడిగానని బహిరంగంగా చెప్పుకున్న జడా శ్రవణ్ కు అవినీతి గురించి, ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదని సుధాకర్ ఎద్దేవా చేశారు.. ఓ పార్టీ పెట్టి తన పార్టీ సిద్దాంతాలను చెప్పే ధైర్యం లేదని. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గని తిట్టడానికి, విమర్శించడానికి మాత్రమే పనిచేసే శ్రవణ్ కు తోడుగా ఇప్పుడు యూ ట్యూబ్ ద్వారా వెకిలి జర్నలిజం చేస్తూ, హిందూ దేవుళ్లను, నిషేధిత ఉగ్రవాద సంస్థలను పొగిడే రావణ్ అనే వ్యక్తి తోడు కాగా. వీరిద్దరికీ తోడుగా నటుడు ప్రకాష్ ఆంథోనీ రాయ్ ఉరఫ్ ప్రకాష్ రాజ్ హిందువులపై, వారి మతాలు, ఆచారలను విమర్శిస్తూ మతాల మధ్య గొడవలు పెడతారని. వీరికి వైసీపీ అన్ని విధాలుగా అండదండలను అందిస్తూ ప్రోత్సహిస్తోందని విమర్శించారు.. . అధికారంలో ఉన్నపుడు అమలాపురం అల్లర్లలో కుల ఘర్షణలు రేపిన వైసీపీ, అధికారం పోయినా అదే పద్ధతిని అనుసరిస్తోంది. రాష్ట్రం పచ్చగా ఉండకుండా, నిత్యం రావణకాష్ఠంలా రగలాలని పన్నాగాలు పన్నుతోంది. దీన్ని రాష్ట్ర ప్రజలు, యువత అర్ధం చేసుకోవాలిని. మతాలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న శ్రవణ్, రావణ్ మాయలో దళిత, క్రిస్టియన్ యువత పడొద్దు. హిందూ, క్రిస్టియన్లు ఎల్లపుడూ సోదరభావంతో మెలుగుతారని తెలిపారు.. ఎవరి స్వలాభం కోసమో, ఎవరి అవసరం కోసమో యువత పావులుగా మారొద్దని కోరారు. ఈ కార్యక్రమము జనసేన పార్టీ లో చేరిన పాస్టర్ల చేత నిర్వహించాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాలవలన కుదరలేదు అని తెలిపారు. ఈ కార్యక్రమములో పొబ్బ సాయి, కందుల లక్ష్మీ కవిత, అఖిలగుంట హెలెన్, కందేటి లక్ష్మీ పాల్గొన్నారు

జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో (జూలై పున్నమి)
మతాల మధ్య చిచ్చు పెట్టాలి.. దానిలో చలి కాచుకోవాలి. కులాల మధ్య కుంపట్లు పెట్టాలి… వికృతానందం పొందాలి. ఇదే వైసీపీ రాష్ట్రంలో పోషిస్తున్న ప్రతిపక్ష పాత్ర. జడ శ్రవణ్ అయినా, ప్రశ్న రావణ్ అయినా తాడేపల్లి ప్యాలెస్ నుంచి పట్టాలు పొందినవాళ్లే. వీరందరినీ పెంచి పోషిస్తోంది వైసీపీ పార్టీయే’ అని జనసేన పార్టీ కావలి కార్యాలయములో జరిగిన ప్రెస్ మీట్ లో కావలి ‌సీనియర్ జనసేన నేత అళహరి సుధాకర్ అన్నారు. యూట్యూబర్ రావణ్ కు వైసీపీ న్యాయపరంగా సాయం చేస్తామని చెప్పడం ద్వారా వీరి బంధం ప్రజలకు బహిరంగంగా తెలిసిందన్నారు. ‘‘అవినీతి కేసుల్లో ఉద్యోగం పోగొట్టుకొని, సమాజంలో అలజడులు సృష్టించడం ద్వారా పబ్బం గడుపుకోవాలని చూస్తున్న జడా శ్రవణ్ కు – ప్రజల కోసం నిత్యం పని చేస్తున్న పవన్ కళ్యాణ్ ని విమర్శించే నైతిక హక్కు లేదు అని. గత ఎన్నికల్లో తెదేపా అధినేత చంద్రబాబు ని రూ.25 కోట్లు, 5 సీట్లు ఇవ్వాలని అడిగానని బహిరంగంగా చెప్పుకున్న జడా శ్రవణ్ కు అవినీతి గురించి, ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదని సుధాకర్ ఎద్దేవా చేశారు.. ఓ పార్టీ పెట్టి తన పార్టీ సిద్దాంతాలను చెప్పే ధైర్యం లేదని. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గని తిట్టడానికి, విమర్శించడానికి మాత్రమే పనిచేసే శ్రవణ్ కు తోడుగా ఇప్పుడు యూ ట్యూబ్ ద్వారా వెకిలి జర్నలిజం చేస్తూ, హిందూ దేవుళ్లను, నిషేధిత ఉగ్రవాద సంస్థలను పొగిడే రావణ్ అనే వ్యక్తి తోడు కాగా. వీరిద్దరికీ తోడుగా నటుడు ప్రకాష్ ఆంథోనీ రాయ్ ఉరఫ్ ప్రకాష్ రాజ్ హిందువులపై, వారి మతాలు, ఆచారలను విమర్శిస్తూ మతాల మధ్య గొడవలు పెడతారని. వీరికి వైసీపీ అన్ని విధాలుగా అండదండలను అందిస్తూ ప్రోత్సహిస్తోందని విమర్శించారు..
. అధికారంలో ఉన్నపుడు అమలాపురం అల్లర్లలో కుల ఘర్షణలు రేపిన వైసీపీ, అధికారం పోయినా అదే పద్ధతిని అనుసరిస్తోంది. రాష్ట్రం పచ్చగా ఉండకుండా, నిత్యం రావణకాష్ఠంలా రగలాలని పన్నాగాలు పన్నుతోంది. దీన్ని రాష్ట్ర ప్రజలు, యువత అర్ధం చేసుకోవాలిని. మతాలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న శ్రవణ్, రావణ్ మాయలో దళిత, క్రిస్టియన్ యువత పడొద్దు. హిందూ, క్రిస్టియన్లు ఎల్లపుడూ సోదరభావంతో మెలుగుతారని తెలిపారు.. ఎవరి స్వలాభం కోసమో, ఎవరి అవసరం కోసమో యువత పావులుగా మారొద్దని కోరారు.
ఈ కార్యక్రమము జనసేన పార్టీ లో చేరిన పాస్టర్ల చేత నిర్వహించాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాలవలన కుదరలేదు అని తెలిపారు. ఈ కార్యక్రమములో పొబ్బ సాయి, కందుల లక్ష్మీ కవిత, అఖిలగుంట హెలెన్, కందేటి లక్ష్మీ పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.