అత్యవసర సమయంలో రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచిన అంజద్ ఖాన్ అమన్
నిర్మల్, పున్నమి రిపోర్టర్ – అబ్దుల్ సాదిక్: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే నిజమైన మానవత్వమని చాటుతూ, అర్ధరాత్రి సమయంలోనూ స్పందించి అత్యవసరంగా రక్తదానం చేసిన అంజద్ ఖాన్ అమన్ అభినందనీయమైన సేవ చేశారు. అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగికి సకాలంలో రక్తాన్ని అందించి ప్రాణరక్షణకు సహకరించారు.
“అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది” అనే సందేశంతో తెలంగాణ ముస్లిం ఏక్తా సోషల్ వెల్ఫేర్ సొసైటీ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని షేక్ ముజాహిద్ తెలిపారు ఆరోగ్యపరంగానే కాకుండా, అవసరమైన సందర్భాల్లో చట్టపరమైన సహాయం అందించేందుకు కూడా సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
సొసైటీ ఉపాధ్యక్షులు సాజిద్ మాట్లాడుతూ అంజద్ ఖాన్ అమన్ ఎప్పుడు పిలిచినా స్పందించి రక్తదానం చేసేందుకు ముందుకు వస్తారని, ఆయన సేవాభావం స్ఫూర్తిదాయకమని అన్నారు.
ఈ కార్యక్రమంలో షేక్ ముజాహిద్, సాజిద్, వాజిద్, ఆఫ్రోజ్ పాషా ఖాన్, ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు సర్జిల్ ఖాన్, మొయిజ్ తదితరులు పాల్గొన్నారు.

కులమతాలకు అతీతంగా మానవత్వమే గొప్పది
అత్యవసర సమయంలో రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచిన అంజద్ ఖాన్ అమన్ నిర్మల్, పున్నమి రిపోర్టర్ – అబ్దుల్ సాదిక్: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే నిజమైన మానవత్వమని చాటుతూ, అర్ధరాత్రి సమయంలోనూ స్పందించి అత్యవసరంగా రక్తదానం చేసిన అంజద్ ఖాన్ అమన్ అభినందనీయమైన సేవ చేశారు. అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగికి సకాలంలో రక్తాన్ని అందించి ప్రాణరక్షణకు సహకరించారు. “అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది” అనే సందేశంతో తెలంగాణ ముస్లిం ఏక్తా సోషల్ వెల్ఫేర్ సొసైటీ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని షేక్ ముజాహిద్ తెలిపారు ఆరోగ్యపరంగానే కాకుండా, అవసరమైన సందర్భాల్లో చట్టపరమైన సహాయం అందించేందుకు కూడా సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. సొసైటీ ఉపాధ్యక్షులు సాజిద్ మాట్లాడుతూ అంజద్ ఖాన్ అమన్ ఎప్పుడు పిలిచినా స్పందించి రక్తదానం చేసేందుకు ముందుకు వస్తారని, ఆయన సేవాభావం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ ముజాహిద్, సాజిద్, వాజిద్, ఆఫ్రోజ్ పాషా ఖాన్, ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు సర్జిల్ ఖాన్, మొయిజ్ తదితరులు పాల్గొన్నారు.

