*కుప్పారెడ్డి పాలెం గ్రామంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా*
దొరవారిసాత్రం మండలం, కుప్పారెడ్డి పాలెం గ్రామంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి.
గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదంగా జిలేబీలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరిగాయి
పున్నమి న్యూస్ సూళ్లూరుపేట ఇంచార్జ్
మద్దాలి వేంకయ్య


