Saturday, 12 September 2026
  • Home  
  • కున్సి రైతాంగానికి కరువు ముప్పు కాలువల్లోకి సాగునీరు విడుదల చేయాలని రైతుల విజ్ఞప్తి
- నారాయణపేట

కున్సి రైతాంగానికి కరువు ముప్పు కాలువల్లోకి సాగునీరు విడుదల చేయాలని రైతుల విజ్ఞప్తి

కృష్ణ మండలం కున్సి గ్రామ రైతాంగానికి కరువు ముప్పు పొంచి ఉంది. వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పొలాల్లో తేమ లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గ్రామానికి సాగునీరు అందించే పెద్ద కాలువలోనూ నీటి ప్రవాహం లేకపోవడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఇటీవల సంగంబండ రిజర్వాయర్ డ్యాం నుంచి నీటిని విడుదల చేసినప్పటికీ, ఆ నీరు డ్యాం పరిసర ప్రాంతాల్లోని పొలాలకే పరిమితమైందని రైతులు చెబుతున్నారు. సమీప గ్రామాలకు నీరు చేరుతున్నప్పటికీ కున్సి గ్రామానికి మాత్రం సాగునీరు అందడం లేదని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పటికే పంటలు ఎండబట్టే పరిస్థితికి చేరుకున్నాయని, కాలువల ద్వారా వెంటనే సాగునీటిని విడుదల చేసి కున్సి రైతాంగాన్ని ఆదుకోవాలని నల్లే శ్రీనివాసులు కోరారు. కనీసం కాలువకు ఇరువైపులా ఉన్న పొలాలకు నీరు అందితే రైతులకు కొంత ఉపశమనం లభిస్తుందని ఆయన తెలిపారు.

కృష్ణ మండలం కున్సి గ్రామ రైతాంగానికి కరువు ముప్పు పొంచి ఉంది. వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పొలాల్లో తేమ లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గ్రామానికి సాగునీరు అందించే పెద్ద కాలువలోనూ నీటి ప్రవాహం లేకపోవడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
ఇటీవల సంగంబండ రిజర్వాయర్ డ్యాం నుంచి నీటిని విడుదల చేసినప్పటికీ, ఆ నీరు డ్యాం పరిసర ప్రాంతాల్లోని పొలాలకే పరిమితమైందని రైతులు చెబుతున్నారు. సమీప గ్రామాలకు నీరు చేరుతున్నప్పటికీ కున్సి గ్రామానికి మాత్రం సాగునీరు అందడం లేదని పేర్కొన్నారు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పటికే పంటలు ఎండబట్టే పరిస్థితికి చేరుకున్నాయని, కాలువల ద్వారా వెంటనే సాగునీటిని విడుదల చేసి కున్సి రైతాంగాన్ని ఆదుకోవాలని నల్లే శ్రీనివాసులు కోరారు. కనీసం కాలువకు ఇరువైపులా ఉన్న పొలాలకు నీరు అందితే రైతులకు కొంత ఉపశమనం లభిస్తుందని ఆయన తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.