మనుబోలు 19-05-2020 (పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్) కీ”శే” చిట్టమూరు దశరథరామిరెడ్డి (EX.ప్రధాన కార్యదర్శి, నెల్లూరు జిల్లా V.A.Os’అసోసియేషన్) గారి 14 వ వర్థంతి ని పురస్కరించుకొని వారి జ్ఞాపకార్థం పేద ప్రజలకు వారి కుమారుడు చిట్టమూరు నరసారెడ్డి గారి ఆధ్వర్యంలో కొండుపాళెం హరిజనవాడ నందు యాబై కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. నరసారెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి కుటుంబం నకు ఐదు కిలోల బియ్యం,కూరగాయలు,కేజీ పామాయిల్, కోడిగుడ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపినారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.