కేశవరం, సెప్టెంబరు 6 (పున్నమి ప్రతినిధి):
ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి ఆధ్వర్యంలో కేశవరం గ్రామానికి చెందిన కీర్తిశేషులు మట్టపర్తి సత్యం జ్ఞాపకార్థం ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
సంస్థ ప్రధాన కార్యదర్శి మట్టపర్తి శ్రీనివాస్ తండ్రి అయిన సత్యం జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల సహకారంతో మల్లంపూడి సాయిబాబా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా వృద్ధులకు భోజనం వడ్డించి, వారి ఆశీస్సులు పొందారు.
సేవా కార్యక్రమాల ద్వారా కీర్తిశేషులు సత్యం జ్ఞాపకాలను స్మరించుకోవడం అభినందనీయమని సేవా సమితి ప్రతినిధులు పేర్కొన్నారు.
అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవతా విలువలను పెంపొందిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సత్యం కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.

కీర్తిశేషులు మట్టపర్తి సత్యం జ్ఞాపకార్థం అన్నదానం
కేశవరం, సెప్టెంబరు 6 (పున్నమి ప్రతినిధి): ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి ఆధ్వర్యంలో కేశవరం గ్రామానికి చెందిన కీర్తిశేషులు మట్టపర్తి సత్యం జ్ఞాపకార్థం ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి మట్టపర్తి శ్రీనివాస్ తండ్రి అయిన సత్యం జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల సహకారంతో మల్లంపూడి సాయిబాబా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వృద్ధులకు భోజనం వడ్డించి, వారి ఆశీస్సులు పొందారు. సేవా కార్యక్రమాల ద్వారా కీర్తిశేషులు సత్యం జ్ఞాపకాలను స్మరించుకోవడం అభినందనీయమని సేవా సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవతా విలువలను పెంపొందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యం కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.

