Saturday, 3 October 2026
  • Home  
  • *కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ 157వ జయంతి*
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ 157వ జయంతి*

​కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 2(పున్నమి న్యూస్): కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా కాకినాడ సిటీ శాసన సభ్యులు వనమాడి కొండబాబు,మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, కాకినాడ సిటీ పరిశీలకులు డి.సి.ఎం.ఎస్ చైర్మన్ పెచ్చేట్టి చంద్రమౌళి,పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా తదితరులు మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.​గాంధీజీ ఆశయ సాధనకు టీడీపీ కృషి: నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సత్యం, అహింస అనే ఆయుధాలతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి, భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. ఆయన చేసిన త్యాగాలు, దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. గాంధీజీ కలలుగన్న ‘గ్రామ స్వరాజ్యం’ సాధన దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ​ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజ అభివృద్ధికి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని వారు స్పష్టం చేశారు.నేటి యువత గాంధీజీ చూపిన సన్మార్గంలో నడిచి, నవ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని నాయకులు ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, టౌన్ ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్,లేబర్ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ గదుల సాయిబాబా, చిక్కాల అబ్బు,శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ వమ్మి బాలాజీ,మెంటా రావు, చింతలపూడి రవి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

​కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 2(పున్నమి న్యూస్):
కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా కాకినాడ సిటీ శాసన సభ్యులు వనమాడి కొండబాబు,మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, కాకినాడ సిటీ పరిశీలకులు డి.సి.ఎం.ఎస్ చైర్మన్ పెచ్చేట్టి చంద్రమౌళి,పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా తదితరులు మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.​గాంధీజీ ఆశయ సాధనకు టీడీపీ కృషి: నాయకులు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సత్యం, అహింస అనే ఆయుధాలతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి, భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. ఆయన చేసిన త్యాగాలు, దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. గాంధీజీ కలలుగన్న ‘గ్రామ స్వరాజ్యం’ సాధన దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
​ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజ అభివృద్ధికి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని వారు స్పష్టం చేశారు.నేటి యువత గాంధీజీ చూపిన సన్మార్గంలో నడిచి, నవ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని నాయకులు ఆకాంక్షించారు.
​ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, టౌన్ ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్,లేబర్ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ గదుల సాయిబాబా, చిక్కాల అబ్బు,శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ వమ్మి బాలాజీ,మెంటా రావు, చింతలపూడి రవి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.