Tuesday, 19 May 2026
  • Home  
  • కాంగ్రెస్‌ దేశ భవిష్యత్తుకోసం నేతలకు వైఎస్ షర్మిల దిశానిర్దేశం
- తిరుపతి

కాంగ్రెస్‌ దేశ భవిష్యత్తుకోసం నేతలకు వైఎస్ షర్మిల దిశానిర్దేశం

శ్రీ కాళహస్తి, మే 19, (పున్నమి న్యూస్): వైఎస్ షర్మిల దేశ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి సమీక్షా సమావేశానికి తిరుపతి జిల్లా నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలువురు కీలక నాయకులు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన షర్మిల, సభకు తరలివచ్చిన జనసంద్రాన్ని చూస్తుంటే రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమనే నమ్మకం కలుగుతోందన్నారు. కొత్తగా పార్టీలో చేరిన నాయకులు క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా డిసిసి అధ్యక్షులు బాలగురవం బాబు, తిరుపతి నగర అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు, శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గండవరం రమేష్ రెడ్డి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.