కవులూరు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట.
-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.
రూ.19.61 కోట్ల సంక్షేమం, అభివృద్ధి నిధులతో గ్రామంలో విస్తృత ప్రగతి.
రూ.36 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రం ప్రారంభం.
ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, 17/09/2026.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2024 నుంచి కవులూరు గ్రామంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు తెలిపారు.
జి.కొండూరు మండలంలోని కవులూరులో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.36 లక్షలతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ కవులూరు గ్రామంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి రావడం గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సేవలను మరింత బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.
సంక్షేమ పథకాల ద్వారా రూ.14.62 కోట్ల లబ్ధి
కవులూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ద్వారా ప్రతి నెలా 820 మంది లబ్ధిదారులకు రూ.35.33 లక్షలు చొప్పున, గత 24 నెలల్లో మొత్తం రూ.9,16,03,000 అందినట్లు తెలిపారు.
తల్లికి వందనం పథకం ద్వారా 1,035 మంది విద్యార్థుల తల్లులకు రెండు సంవత్సరాలకు కలిపి రూ.1,34,55,000, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 967 మంది రైతులకు నాలుగు విడతల్లో రూ.4,06,14,000 అందినట్లు వివరించారు. ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా తొలి సంవత్సరంలో 45 మంది ఆటో డ్రైవర్లకు రూ.5,35,000 అందిందన్నారు. ఈ పథకాల ద్వారా గ్రామ ప్రజలకు మొత్తం రూ.14,62,07,000 సంక్షేమ నిధులు అందినట్లు తెలిపారు.
వైద్యానికి రూ.83.63 లక్షల ఆర్థిక సాయం
ఆపదలో ఉన్న కవులూరు గ్రామ ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎల్ఓసీల ద్వారా ప్రభుత్వం అండగా నిలిచిందని ఎమ్మెల్యే గారు తెలిపారు. సి.ఎం.ఆర్.ఎఫ్ ద్వారా 50 మందికి రూ.37,31,587, ఎల్.ఓ.సిల ద్వారా 22 మందికి రూ.46,31,560 కలిపి మొత్తం రూ.83,63,147 వైద్య సహాయం అందినట్లు వివరించారు.
రూ.1.27 కోట్ల డి.ఎం.ఎఫ్ నిధులతో అభివృద్ధి పనులు
కవులూరు గ్రామంలో డి.ఎం.ఎఫ్ గ్రాంట్ ద్వారా మొత్తం రూ.1.27 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. కవులూరు–శాంతినగర్ రహదారి పనులకు తొలి రెండు విడతల్లో రూ.60 లక్షలు, రూ.35 లక్షలు కలిపి రూ.95 లక్షలు, కవులూరు–వెలగలేరు–కొత్తూరు–తాడేపల్లి రహదారి మరమ్మతులు, కొత్త రోడ్డు నిర్మాణానికి రూ.22 లక్షలు, కొత్త కాలనీ లేఅవుట్లు, రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.10 లక్షలు కేటాయించినట్లు వివరించారు.
అదేవిధంగా ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ ద్వారా రూ.44.50 లక్షలు, ఏపీఆర్ఆర్ఎస్ ప్రాజెక్టుల ద్వారా ప్రధాన రహదారి పనులకు రూ.1.65 కోట్లు, ఆర్అండ్బీ శాఖ ద్వారా రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు రూ.72 లక్షలు, గ్రామీణ ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి రూ.36 లక్షలు, ఇరిగేషన్ శాఖ ద్వారా తారకరామ కాలువల కట్టల మరమ్మతులు, పూడికతీత పనులకు రూ.70 లక్షలు వంటి పనులు చేపట్టినట్లు గ్రామ టీడీపీ నాయకులు తెలిపారు.
రైతులకు గోకులం షెడ్లు, యంత్ర సేవలు
గ్రామంలోని రైతులకు కూడా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఏడుగురు రైతులకు 90 శాతం సబ్సిడీతో రూ.14.70 లక్షల విలువైన గోకులం షెడ్లు నిర్మించినట్లు చెప్పారు. వ్యవసాయ యంత్ర సేవలో భాగంగా 50 శాతం సబ్సిడీతో ఐదుగురు రైతులకు రోటవేటర్లు, ఛార్జింగ్ స్ప్రే పంపులు పంపిణీ చేసినట్లు వివరించారు.
రూ.19.61 కోట్లతో కవులూరు అభివృద్ధి
కవులూరు గ్రామానికి కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, వైద్య సహాయం కలిపి రూ.15,61,27,747, అభివృద్ధి పనుల కోసం రూ.4,00,20,000 నిధులు వెచ్చించినట్లు గ్రామ టీడీపీ నాయకులు తెలిపారు. మొత్తంగా రూ.19,61,47,747, అంటే సుమారు రూ.19.61 కోట్ల సంక్షేమ, అభివృద్ధి నిధులు గ్రామానికి అందినట్లు వెల్లడించారు.
“కవులూరు గ్రామ అభివృద్ధికి, ప్రతి కుటుంబ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తాం” అని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నాకవులూరు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట.

ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.