Friday, 11 July 2025
  • Home  
  • కరోన కట్టడికి వై.కా.పా నేత కిరణ్ కుమార్ రెడ్డి ముందడుగు రెండు లక్షల రూపాయల సామగ్రి అందజేత
- Featured

కరోన కట్టడికి వై.కా.పా నేత కిరణ్ కుమార్ రెడ్డి ముందడుగు రెండు లక్షల రూపాయల సామగ్రి అందజేత

కరోనా కట్టడికి కిరణ్ కుమార్ రెడ్డి ముందడుగు రెండు లక్షల విలువ చేసే సామాగ్రి పంపిణీ 20-07-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి)మనుబోలు మండలం లో కరోనా వ్యాప్తి అరికట్టేందుకు మనుబోలు మండలం అక్కంపేట మాజీ సర్పంచ్ వైకాపా యువనేత నారపనేని కిరణ్ కుమార్ రెడ్డి ముందడుగువేశారు. సుమారు రెండు లక్షల విలువ చేసేపల్స్ ఆక్సిమీటర్లు ,ధర్మ మీటర్లు శానిటైజర్,మాస్కులు తహశీల్దార్ ,ఎంపిడిఓ,వెలుగు,ప్రభుత్వ ఆసుపత్రి పోలీస్ స్టేషన్ మొదలగు కార్యాలయమునకు మండలంలో గల 14సచివాలయాలకు పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కాకాణి ఆదేశాల మేరకు కరోన ప్రత్యేక పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకొని కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతిఒక్కరు ఎంతలే అనుకోకుండా జాగ్రత్తలు తప్పనిసరి గా పాటించాలన్నారు. కరోనా నియంత్రణ లో మండల అధికారులు ఆదర్శంగా నిలువాలన్నారు. తహసిల్దార్ మాట్లాడుతూ కరోనా ను ఎదుర్కొనాలి అంటే ప్రభుత్వం వారు మనకు ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలి అన్నారు ప్రజలందరూ పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు చేతులను శానిటైజర్ తో శుభ్రపరచుకోవాలి అన్నారు రాబోవు రెండు నెలల్లో కరోనా తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందన్నారు అందువల్ల ప్రతి ఒక్కరూ బయటికి వచ్చేటప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కు ధరించాలి అని తెలియజేశారు ఏ మండలం లేనివిధంగా మనుబోలు మండలం లో కరోనా నిర్మూలనకు కిరణ్ కుమార్ రెడ్డి చేయూత మరువలేనిదన్నారు. అనంతరం వైకాపా నాయకులు కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ,బొమ్మిరెడ్డి హరరగోపాల్ రెడ్డి కిరణ్ దాతృత్వాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలోవైద్యాధికారి సుబ్బరాజు వైకాపా నాయకులు దాసరి బాస్కర్ గౌడ్,చేరెడ్డి పట్టాభి రామిరెడ్డి, దాసరి మహేంద్ర వర్మ,అన్నమాల ప్రభాకర్ రెడ్డి ,గుంజి రమేష్ తులసి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


కరోనా కట్టడికి కిరణ్ కుమార్ రెడ్డి ముందడుగు రెండు లక్షల విలువ చేసే సామాగ్రి పంపిణీ
20-07-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి)మనుబోలు మండలం లో కరోనా వ్యాప్తి అరికట్టేందుకు మనుబోలు మండలం అక్కంపేట మాజీ సర్పంచ్ వైకాపా యువనేత నారపనేని కిరణ్ కుమార్ రెడ్డి ముందడుగువేశారు. సుమారు రెండు లక్షల విలువ చేసేపల్స్ ఆక్సిమీటర్లు ,ధర్మ మీటర్లు శానిటైజర్,మాస్కులు తహశీల్దార్ ,ఎంపిడిఓ,వెలుగు,ప్రభుత్వ ఆసుపత్రి పోలీస్ స్టేషన్ మొదలగు కార్యాలయమునకు మండలంలో గల 14సచివాలయాలకు పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కాకాణి ఆదేశాల మేరకు కరోన ప్రత్యేక పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకొని కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతిఒక్కరు ఎంతలే అనుకోకుండా జాగ్రత్తలు తప్పనిసరి గా పాటించాలన్నారు. కరోనా నియంత్రణ లో మండల అధికారులు ఆదర్శంగా నిలువాలన్నారు. తహసిల్దార్ మాట్లాడుతూ కరోనా ను ఎదుర్కొనాలి అంటే ప్రభుత్వం వారు మనకు ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలి అన్నారు ప్రజలందరూ పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు చేతులను శానిటైజర్ తో శుభ్రపరచుకోవాలి అన్నారు రాబోవు రెండు నెలల్లో కరోనా తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందన్నారు అందువల్ల ప్రతి ఒక్కరూ బయటికి వచ్చేటప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కు ధరించాలి అని తెలియజేశారు ఏ మండలం లేనివిధంగా మనుబోలు మండలం లో కరోనా నిర్మూలనకు కిరణ్ కుమార్ రెడ్డి చేయూత మరువలేనిదన్నారు. అనంతరం వైకాపా నాయకులు కడివేటి చంద్రశేఖర్ రెడ్డి
,బొమ్మిరెడ్డి హరరగోపాల్ రెడ్డి కిరణ్ దాతృత్వాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలోవైద్యాధికారి సుబ్బరాజు వైకాపా నాయకులు దాసరి బాస్కర్ గౌడ్,చేరెడ్డి పట్టాభి రామిరెడ్డి, దాసరి మహేంద్ర వర్మ,అన్నమాల ప్రభాకర్ రెడ్డి ,గుంజి రమేష్ తులసి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.