సత్తుపల్లి/ఖమ్మం
ఒడిశా నుంచి హైదరాబాద్‌కు కారులో గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు నిందితులను సత్తుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ పర్యవేక్షణలో ఈగల్ టీమ్, సత్తుపల్లి పోలీస్ సిబ్బంది సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన కారును తనిఖీ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు ఒడిశా రాష్ట్రం కోరాపుట్‌కు చెందిన కామేష్ మారి, కారా రాజేంద్రగా గుర్తించారు. వారి వద్ద నుంచి సుమారు రూ.3 లక్షలకు పైగా విలువైన 6 కేజీల 360 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు, ఒక 110 కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని సత్తుపల్లి ఇన్స్పెక్టర్ శ్రీహరి తెలిపారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు.



