Monday, 7 September 2026
  • Home  
  • ఏపీ సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్ డిమాండ్
- విశాఖపట్నం

ఏపీ సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్ డిమాండ్

విశాఖపట్నం: విశాఖపట్నం ద్వారకానగర్ జంక్షన్ వద్ద భారీ ధర్నా, నిరాహార దీక్ష చేపట్టిన వేలాది మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్ పూర్తి సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం తన ఉదాసీన వైఖరిని వీడి, ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సనపల రవీంద్ర భరత్ మీడియాతో మాట్లాడుతూ.. సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులలో అత్యధిక శాతం మంది వెనుకబడిన తరగతులు (BC), ఎస్సీ (SC), ఎస్టీ (ST), మరియు మైనారిటీ వర్గాలకు చెందినవారేనని గుర్తుచేశారు. వారి ప్రాథమిక హక్కులను కాలరాయడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వం బలహీన వర్గాలకు చెందిన వేలాది కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీస్తోందని ఆయన మండిపడ్డారు.”ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, మరియు అల్లూరి సీతారామరాజు ప్రాంతాల నుండి ఇంత భారీ ఎత్తున ఉద్యోగులు తరలిరావడం.. వారిలో ఉన్న తీవ్ర అసంతృప్తికి, ఆవేదనకు నిదర్శనం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ సచివాలయ వ్యవస్థను తీసుకువస్తే, ప్రస్తుత పాలకులు వారి సొంత జీతాల కోసం, బకాయిల కోసం రోడ్లపైకి వచ్చేలా చేశారు” అని రవీంద్ర భారత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన ప్రధాన డిమాండ్లకు వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ తరపున ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు ఏఏసీ తక్షణమే అమలు చేయాలని, 12వ పీఆర్సీ (PRC) తక్షణ అమలు: ఉద్యోగులకు న్యాయమైన వేతన సవరణను వెంటనే చేపట్టాలి. 5 పెండింగ్ డీఏలు & 30% ఐఆర్ (IR) విడుదల: ఉద్యోగులపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు పెండింగ్ అలవెన్సులను వెంటనే ఇవ్వాలి.₹28,000 కోట్ల బకాయిల చెల్లింపు: నిలిచిపోయిన బిల్లులు మరియు జీతాల బకాయిలను వెంటనే విడుదల చేయాలి.ఏఏఎస్ (AAS) ఇంక్రిమెంట్లు: సచివాలయ సిబ్బందికి నోషనల్ మరియు అష్యూర్డ్ కెరీర్ ప్రొగ్రెషన్ ఇంక్రిమెంట్లను మంజూరు చేయాలి.ఉద్యోగ భద్రత: కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల భద్రత కోసం స్పష్టమైన హెచ్ఆర్ (HR) పాలసీని తీసుకురావాలి.ఈహెచ్‌ఎస్ (EHS) బలోపేతం: ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు మెరుగైన ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలి.కేవలం రోడ్లపై ట్రాఫిక్‌ను క్లియర్ చేయడం కోసం అధికారులను పంపడం కాదు, ప్రభుత్వం ఉన్నత స్థాయి మంత్రివర్గ కమిటీతో చర్చలు జరిపి స్పష్టమైన హామీ ఇవ్వాలని సనపల రవీంద్ర భరత్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్చలు జరపకపోతే, వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఉద్యోగుల పక్షాన రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

విశాఖపట్నం: విశాఖపట్నం ద్వారకానగర్ జంక్షన్ వద్ద భారీ ధర్నా, నిరాహార దీక్ష చేపట్టిన వేలాది మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్ పూర్తి సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం తన ఉదాసీన వైఖరిని వీడి, ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సనపల రవీంద్ర భరత్ మీడియాతో మాట్లాడుతూ.. సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులలో అత్యధిక శాతం మంది వెనుకబడిన తరగతులు (BC), ఎస్సీ (SC), ఎస్టీ (ST), మరియు మైనారిటీ వర్గాలకు చెందినవారేనని గుర్తుచేశారు. వారి ప్రాథమిక హక్కులను కాలరాయడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వం బలహీన వర్గాలకు చెందిన వేలాది కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీస్తోందని ఆయన మండిపడ్డారు.”ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, మరియు అల్లూరి సీతారామరాజు ప్రాంతాల నుండి ఇంత భారీ ఎత్తున ఉద్యోగులు తరలిరావడం.. వారిలో ఉన్న తీవ్ర అసంతృప్తికి, ఆవేదనకు నిదర్శనం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ సచివాలయ వ్యవస్థను తీసుకువస్తే, ప్రస్తుత పాలకులు వారి సొంత జీతాల కోసం, బకాయిల కోసం రోడ్లపైకి వచ్చేలా చేశారు” అని రవీంద్ర భారత్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన ప్రధాన డిమాండ్లకు వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ తరపున ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు ఏఏసీ తక్షణమే అమలు చేయాలని,
12వ పీఆర్సీ (PRC) తక్షణ అమలు: ఉద్యోగులకు న్యాయమైన వేతన సవరణను వెంటనే చేపట్టాలి.
5 పెండింగ్ డీఏలు & 30% ఐఆర్ (IR) విడుదల: ఉద్యోగులపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు పెండింగ్ అలవెన్సులను వెంటనే ఇవ్వాలి.₹28,000 కోట్ల బకాయిల చెల్లింపు: నిలిచిపోయిన బిల్లులు మరియు జీతాల బకాయిలను వెంటనే విడుదల చేయాలి.ఏఏఎస్ (AAS) ఇంక్రిమెంట్లు: సచివాలయ సిబ్బందికి నోషనల్ మరియు అష్యూర్డ్ కెరీర్ ప్రొగ్రెషన్ ఇంక్రిమెంట్లను మంజూరు చేయాలి.ఉద్యోగ భద్రత: కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల భద్రత కోసం స్పష్టమైన హెచ్ఆర్ (HR) పాలసీని తీసుకురావాలి.ఈహెచ్‌ఎస్ (EHS) బలోపేతం: ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు మెరుగైన ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలి.కేవలం రోడ్లపై ట్రాఫిక్‌ను క్లియర్ చేయడం కోసం అధికారులను పంపడం కాదు, ప్రభుత్వం ఉన్నత స్థాయి మంత్రివర్గ కమిటీతో చర్చలు జరిపి స్పష్టమైన హామీ ఇవ్వాలని సనపల రవీంద్ర భరత్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్చలు జరపకపోతే, వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఉద్యోగుల పక్షాన రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.