డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు నుంచి వేటకు వెళ్లి గత 23 రోజులుగా ఆచూకీ లేకుండా ఉన్న ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా ఉన్నారన్న సమాచారం అందడం ఎంతో ఆనందం కలిగించిందని శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అన్నారు.ఈ సందర్భంగా క్షేమంగా పశ్చిమ బెంగాల్ తీరంలో ఉన్న బాధితులతో దాట్ల సుబ్బరాజు మొబైల్ ఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరలోనే సొంత ఇళ్లకు చేరే ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
మత్స్యకారుల కోసం గత 23 రోజులుగా నిరంతరం గాలింపు చర్యలు చేపట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలకు, సహకరించిన అధికారులకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడం అభినందనీయమన్నారు.
ఏడుగురు మత్స్యకారులు త్వరితగతిన సురక్షితంగా తమ స్వగ్రామాలకు చేరుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు. గత 23 రోజులుగా ఆందోళనలో ఉన్న వారి కుటుంబ సభ్యుల్లో ఆనందం నింపిన ఈ శుభవార్త ఎంతో సంతోషాన్ని కలిగించిందని దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు.
Uploaded Video:


