*ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా వెంచర్లు – గిరిజన భూములపై అక్రమ లేఔట్లు కలకలం*
*ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేత*
*పిసా ఎల్ టి ఆర్ చట్టాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్*
జులై 01 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు:
తూతక్క లింగన్నపేట రెవిన్యూ గ్రామపంచాయతీ లో గల గుడ్ న్యూస్ స్కూల్ ఎదురుగా అక్రమ వెంచర్
షెడ్యూల్డ్ ఏరియా అయిన ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ వెంచర్లు, ప్లాట్ల విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. దీనిపై స్థానిక గిరిజన సంఘాలు ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం 1996లో తీసుకువచ్చిన చట్టాలను సైతం లెక్కచేయకుండా అక్రమ వెంచర్లు పుట్టుకొస్తున్నాయి
*పిసా చట్టం*
ప్రకారం, షెడ్యూల్డ్ ఏరియాలో ఏదైనా భూమి లావాదేవీ, అభివృద్ధి పనులు జరపాలంటే సంబంధిత గ్రామసభ ఆమోదం తప్పనిసరి. అయితే తూతక్క లింగన్నపేట రెవిన్యూ గ్రామపంచాయతీ లోగల గుడ్ న్యూస్ స్కూల్ ఎదురుగా అక్రమ వెంచర్ గ్రామసభ తీర్మానం లేకుండానే వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్లు అమ్ముతున్నారు.
ఎల్ టి ఆర్ 1/70 చట్టం సైతం బేఖాతరు
ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ఏరియాస్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్ రెగ్యులేషన్ – ఎల్ టి ఆర్ 1/70 చట్టం ప్రకారం గిరిజనేతరులు ఏజెన్సీ భూములు కొనుగోలు చేయడం, అమ్మడం పూర్తిగా నిషేధం. కానీ బినామీ పేర్లతో, నకిలీ పత్రాలతో గిరిజన భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లుగా మార్చి అమ్మకాలకు పెట్టడం గమనార్హం.
అక్రమ వెంచర్ల పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి
గిరిజనులు భూమి కోల్పోతున్నారు
మాయమాటలు చెప్పి తక్కువ ధరకు భూములు కొట్టేస్తున్నారు.
అనుమతి లేని లేఔట్లలో రోడ్లు, డ్రైనేజీ అంటూ ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తుంది.
వ్యవసాయ భూములు, వెంచర్లు వేస్తుండటంతో
గిరిజన నాయకులు మాట్లాడుతూ, “ఏజెన్సీ ప్రాంతం అంటే గిరిజనుల స్వపరిపాలన. ఇక్కడ అక్రమ వెంచర్లు అంటే రాజ్యాంగ ఉల్లంఘన. వెంటనే ఐ టి డి ఏ కలెక్టర్, పోలీస్ శాఖలు సంయుక్తంగా దాడులు చేసి అక్రమ లేఔట్లను రద్దు చేయాలి. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి” అని డిమాండ్ చేశారు.
ఈ అక్రమాలపై తక్షణమే విచారణ చేపట్టి, దోషులను శిక్షించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని గిరిజన నాయకుడు నరేష్ జాదవ్ హెచ్చరించారు.


