Monday, 21 September 2026
  • Home  
  • ఎస్.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర”
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎస్.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర”

గూడూరు ఆగస్టు 22 ఎస్.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత, పారిశుధ్యంపై ప్రత్యేక అవగాహన మరియు పారిశుధ్య కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. రాంప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి కిరణ్మయి, స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర (SASA) కో-ఆర్డినేటర్ డా. ఎ. వి. ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పరిశుభ్రమైన వాతావరణం ఆరోగ్యం మరియు మేధో వికాసానికి ఎంతగానో దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా వక్తలు పిలుపునిచ్చారు. అనంతరం ప్రిన్సిపాల్, సిబ్బంది మరియు విద్యార్థులు కలిసి కళాశాల ప్రాంగణంలో శ్రమదానం చేసి పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించి పారిశుధ్య పనులు చేపట్టారు. ఈ కార్యక్రమం ముగింపులో పరిసరాల పరిశుభ్రతను నిరంతరం కాపాడుకుంటామని మరియు “స్వచ్చ ఆంధ్ర” లక్ష్య సాధనకు కృషి చేస్తామని కళాశాల అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులందరూ కలిసి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.

గూడూరు ఆగస్టు 22
ఎస్.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత, పారిశుధ్యంపై ప్రత్యేక అవగాహన మరియు పారిశుధ్య కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. రాంప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి కిరణ్మయి, స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర (SASA) కో-ఆర్డినేటర్ డా. ఎ. వి. ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పరిశుభ్రమైన వాతావరణం ఆరోగ్యం మరియు మేధో వికాసానికి ఎంతగానో దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా వక్తలు పిలుపునిచ్చారు. అనంతరం ప్రిన్సిపాల్, సిబ్బంది మరియు విద్యార్థులు కలిసి కళాశాల ప్రాంగణంలో శ్రమదానం చేసి పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించి పారిశుధ్య పనులు చేపట్టారు. ఈ కార్యక్రమం ముగింపులో పరిసరాల పరిశుభ్రతను నిరంతరం కాపాడుకుంటామని మరియు “స్వచ్చ ఆంధ్ర” లక్ష్య సాధనకు కృషి చేస్తామని కళాశాల అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులందరూ కలిసి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.