Wednesday, 17 June 2026
  • Home  
  • ఎరువుల కొరత నివారించాలి:మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎరువుల కొరత నివారించాలి:మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

ఆత్మకూరు ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు అవసరమైన ఎరువులను సమృద్ధిగా అందుబాటులో ఉంచడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి విమర్శించారు. ఏపీఏఐఎంఎస్‌ యాప్‌ పేరుతో కొత్త విధానాన్ని అమలు చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులకు సులభంగా అందాల్సిన యూరియా, డీఏపీ ఎరువులు ఇప్పుడు యాప్‌లు, సాంకేతిక నిబంధనల చుట్టూ తిరిగే పరిస్థితి తీసుకురావడం దురదృష్టకరమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు, స్మార్ట్‌ఫోన్ వినియోగంపై అవగాహన లేని రైతులు అధిక సంఖ్యలో ఉన్నారని, అలాంటి పరిస్థితుల్లో ఏపీఏఐఎంఎస్‌ యాప్‌ను బలవంతంగా అమలు చేయడం రైతులకు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతుందని పేర్కొన్నారు.కౌలు రైతులు, పట్టాదారు పాస్‌బుక్ లేని రైతులు, ప్రభుత్వ భూములు లేదా చెరువు లోతట్టు ప్రాంతాల్లో సాగు చేస్తున్న రైతులకు ఎరువులు ఎలా అందిస్తారో ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిని కార్యాలయాల చుట్టూ, ఎరువుల దుకాణాల చుట్టూ తిరిగేలా చేస్తోందని విమర్శించారు.గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ సేవలను గ్రామస్థాయికి తీసుకెళ్లామని గుర్తుచేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.నెల్లూరు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో లక్షల ఎకరాల్లో సాగు జరగనున్న నేపథ్యంలో ఎరువుల నిల్వలను వెంటనే పెంచి, కొరత లేకుండా సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఏపీఏఐఎంఎస్‌ యాప్‌ వినియోగంలో ఉన్న సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రతి మండలం, ప్రతి గ్రామంలో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కౌలు రైతులకు ప్రత్యేక విధానాన్ని ప్రకటించడంతో పాటు ఎరువుల పంపిణీలో పూర్తి పారదర్శకత పాటించాలని మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేసే నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకుని, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

ఆత్మకూరు
ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు అవసరమైన ఎరువులను సమృద్ధిగా అందుబాటులో ఉంచడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి విమర్శించారు. ఏపీఏఐఎంఎస్‌ యాప్‌ పేరుతో కొత్త విధానాన్ని అమలు చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులకు సులభంగా అందాల్సిన యూరియా, డీఏపీ ఎరువులు ఇప్పుడు యాప్‌లు, సాంకేతిక నిబంధనల చుట్టూ తిరిగే పరిస్థితి తీసుకురావడం దురదృష్టకరమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు, స్మార్ట్‌ఫోన్ వినియోగంపై అవగాహన లేని రైతులు అధిక సంఖ్యలో ఉన్నారని, అలాంటి పరిస్థితుల్లో ఏపీఏఐఎంఎస్‌ యాప్‌ను బలవంతంగా అమలు చేయడం రైతులకు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతుందని పేర్కొన్నారు.కౌలు రైతులు, పట్టాదారు పాస్‌బుక్ లేని రైతులు, ప్రభుత్వ భూములు లేదా చెరువు లోతట్టు ప్రాంతాల్లో సాగు చేస్తున్న రైతులకు ఎరువులు ఎలా అందిస్తారో ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిని కార్యాలయాల చుట్టూ, ఎరువుల దుకాణాల చుట్టూ తిరిగేలా చేస్తోందని విమర్శించారు.గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ సేవలను గ్రామస్థాయికి తీసుకెళ్లామని గుర్తుచేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.నెల్లూరు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో లక్షల ఎకరాల్లో సాగు జరగనున్న నేపథ్యంలో ఎరువుల నిల్వలను వెంటనే పెంచి, కొరత లేకుండా సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఏపీఏఐఎంఎస్‌ యాప్‌ వినియోగంలో ఉన్న సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రతి మండలం, ప్రతి గ్రామంలో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కౌలు రైతులకు ప్రత్యేక విధానాన్ని ప్రకటించడంతో పాటు ఎరువుల పంపిణీలో పూర్తి పారదర్శకత పాటించాలని మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేసే నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకుని, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.