గడచిన నాలుగు దశాబ్దాలుగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలబడిన తెలుగుదేశం, ఎన్డీయే కూటమి ప్రభుత్వంతోనే బీసీలకు నిజమైన మేలు జరుగుతుందని శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ నాయకులు కొనియాడారు. వైసిపి విధ్వంసకర పాలన అంతమై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం వికాసం వైపు అడుగులు వేస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచే బాలబాలికల కోసం మరో 10 మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం బీసీ విద్యార్థులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం మంత్రి లోకేష్ చొరవతో వడ్డెర సొసైటీలకు ప్రాధాన్యత కల్పిస్తూ క్వారీ లీజుల కేటాయింపులపై ఉత్తర్వులు జారీ చేయడం పట్ల వడ్డెర సోదరులు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాకతో బీసీలకు మంచిరోజులు ప్రారంభమయ్యాయని, ఎన్నికల హామీలను పక్కాగా అమలు చేస్తున్నారని నేతలు పేర్కొన్నారు. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్, గీత కార్మికులకు మద్యం షాపులు, బార్లలో 10% కేటాయింపు, వడ్డెరలకు క్వారీల కేటాయింపుల్లో 33% రిజర్వేషన్లతో పాటు ఫీజు మినహాయింపులు ఇవ్వడం చంద్రబాబు ప్రభుత్వ ఘనతేనన్నారు. అలాగే మత్స్యకారులకు నిషేధ కాలపు సాయం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచడం, వివాదాస్పద జీవో 217 రద్దు చేయడం జరిగిందని గుర్తుచేశారు. నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్‌ను 200 యూనిట్లకు, దేవాలయాల్లో పనిచేసే వారికి గౌరవ వేతనాన్ని రూ.25 వేలకు పెంచారని తెలిపారు. నేతన్నలకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు, బీసీల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే స్మృతివనం ఏర్పాటుకు, సుమారు రూ.1000 కోట్లతో ‘ఆదరణ 3.0’ పథకం ద్వారా ఆధునిక పరికరాల పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ డా.జి.దశరథాచారి, వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, తంగేళ్ళపాలెం పీఏసీఎస్ ఛైర్మన్ భాస్కర్ ముదిరాజ్, నాయకులు డి.వి.నారాయణ, వజ్రం కిషోర్, కోట చంద్రశేఖర్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఎన్డీయే కూటమి ప్రభుత్వంతోనే బీసీలకు సంపూర్ణ మేలు-శ్రీకాళహస్తి టీడీపీ నేతల హర్షం