Wednesday, 16 September 2026
  • Home  
  • ఎథిక్స్ కమిటీపై ప్రశాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
- తెలంగాణ

ఎథిక్స్ కమిటీపై ప్రశాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్ష సభ్యులను వేధించేందుకే ఎథిక్స్ కమిటీని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. పాడి కౌశిక్ రెడ్డిని విచారించే ముందు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసెంబ్లీ వ్యాఖ్యలు, ప్రవర్తనపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పాలకపక్షానికి, ప్రతిపక్షానికి వేర్వేరు న్యాయాలు ఉండకూడదన్నారు. ఎథిక్స్ కమిటీ రాజకీయ కమిటీగా మారకూడదని పేర్కొన్నారు. ఈ నెల 29న జరిగే కమిటీ సమావేశానికి హాజరై తమ అభ్యంతరాలను వెల్లడిస్తామని చెప్పారు. ప్రభుత్వ కక్షసాధింపు, డైవర్షన్ రాజకీయాలను మానుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.