మహిళల వన్డే వరల్డ్కప్ 2025లో భారత జట్టు అద్భుత చరిత్ర సృష్టించింది. ముంబయిలో జరిగిన రెండో సెమీఫైనల్లో బలమైన ఆస్ట్రేలియా జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసింది. ఫీబీ లిచ్ఫీల్డ్ 93 బంతుల్లో 119 పరుగులతో మెరిసింది. భారత బౌలర్ శ్రీ చరణి 10 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు.
తదుపరి లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన భారత మహిళా జట్టు అద్భుత బ్యాటింగ్ ప్రదర్శించింది. జెమిమా రోడ్రిగ్స్ 134 బంతుల్లో అజేయంగా 127 పరుగులు చేయడం ద్వారా జట్టును విజయతీరాలకు చేర్చింది. ఆమెకు తోడుగా ఇతర బ్యాటర్లు సమర్థంగా ఆడారు. చివరికి భారత్ 48.3 ఓవర్లలో 341/5 పరుగులు సాధించి 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ విజయంతో భారత్ మహిళల వరల్డ్కప్ ఫైనల్లోకి అర్హత సాధించింది. ఫైనల్ లో సౌత్ ఆఫ్రికా పై ఢీ ,
దేశవ్యాప్తంగా అభిమానులు ఆనందంతో ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. జెమిమా రోడ్రిగ్స్ అజేయ శతకం భారత్ విజయానికి కీలకం అయింది. ఇప్పుడు భారత మహిళా జట్టు చరిత్రాత్మక కప్ విజయం దిశగా అడుగులు వేస్తోంది.


