విద్యార్థుల ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామ చంద్ర రావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష 2వ రోజు మంగళవారం తెలంగాణ రాష్ట్ర బీజేపీ ట్రేడింగ్ సెల్ కన్వీనర్ ఉప్పల శారదా దీక్ష శిబిరాన్ని సందర్శించి తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్‌కు ఉపకార వేతనాలు ఎంతో కీలకమని అన్నారు. ఉపకార వేతనాలు సకాలంలో అందకపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థుల చదువులకు ఆర్థిక భారం కాకుండా ప్రభుత్వం తక్షణమే పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేయాలని ఉప్పల శారదా డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామ చంద్ర రావు చేపట్టిన నిరాహార దీక్షకు విద్యార్థులు, తల్లిదండ్రులు, బీజేపీ శ్రేణులు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. ఉపకార వేతనాల కోసం బీజేపీ చేస్తున్న పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ఉప్పల శారదా స్పష్టం చేశారు.




