ఖమ్మం
(పున్నమి న్యూస్)
పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం PDSU ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్‌ను విద్యార్థులు ముట్టడించారు. ముందుగా నగరంలో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు అనంతరం కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఉపకార వేతనాల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని PDSU ఖమ్మం జిల్లా అధ్యక్షుడు జీ. మస్తాన్ ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బకాయి ఉపకార వేతనాలను తక్షణమే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



