శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి పట్టణంలోని కోళ్ల వీధిలో షేక్ అక్బర్ (55) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా విషాదం నింపింది. కొన్ని రోజులుగా తన భార్య తీవ్ర అనారోగ్యంతో మంచాన పడటంతో, షేక్ అక్బర్ మానసికంగా తీవ్ర కుంగుబాటుకు లోనయ్యాడని స్థానికులు తెలిపారు. ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక అతను ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఘటన గురించి సమాచారం అందుకున్న ఉదయగిరి ఎస్ఐ బి. మహేంద్ర వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఉదయగిరిలో విషాదం.. భార్య అనారోగ్యం తట్టుకోలేక భర్త ఆత్మహత్య