కామారెడ్డి, 29జులై, ( పున్నమి ప్రతినిధి ) : రామారెడ్డి మండలం, ఇస్సన్నపల్లి గ్రామ పంచాయి తీ వద్ద బుధవారం నిర్వహించిన గ్రామ సభలో వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓ రాకేష్ మా ట్లాడుతూ, రైతులు తమ పొలాల్లో ఫారం పాండ్లు (వ్యవసాయ గుంతలు) తవ్వుకోవడానికి ముందు కు రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు, వ్యవసాయాన్ని లాభసాటిగా మల్చుకునేందుకు ఫారం పాండ్లు ఎంతగానో దోహదపడతాయని ఆయన వివరిం చారు.ఫారం పాండ్ల ద్వారా కలిగే ముఖ్య ప్రయోజ నాలు….నీటి నిల్వ, పంటల సంరక్షణకు వర్షపు నీటిని నిల్వ చేసి, అవసరమైనప్పుడు పంటలకు అందించవచ్చు. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితుల్లో ఒకటి లేదా రెండు తడులు ఇచ్చి పంటలను కాపా డుకోవచ్చని చెప్పారు.భూగర్భ జలాల వృద్ధికీ నీరు భూమిలోకి ఇంకి, బోర్లు మరియు బావుల్లో నీటి మ ట్టం పెరగడానికి సహాయపడుతుంది.ప్రత్యామ్నా య సాగుకు బాట నువ్వులు, కూరగాయలు, పండ్ల తోటలు వంటి ఆరుతడి పంటల సాగుకు ఈ నీటిని వినియోగించుకోవచ్చని అన్నారు.అదనపు ఆదా యం (చేపల పెంపకం) ఫారం పాండ్లలో చేపల పెంపకం చేపట్టడం ద్వారా రైతులు అదనపు ఆదా యాన్ని పొందవచ్చన్నారు.పశువుల తాగునీరు గ్రామీణ ప్రాంతాల్లో పశువుల తాగునీటి అవసరాల ను తీర్చడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.మట్టి సంరక్షణ వర్షపు నీటి వేగవంతమైన ప్రవాహా న్ని తగ్గించి, భూసారం కోల్పోకుండా (మట్టి కోతను నివారించి) కాపాడుతుంది. వాతావరణ మార్పుల తట్టుకునే శక్తి: ఎల్-నినో వంటి ప్రతికూల వాతా వరణ పరిస్థితుల్లో ఏర్పడే నీటి కొరతను ఎదుర్కొ నేందుకు ఇది బలమైన ప్రత్యామ్నాయం, ఉద్యాన పంటల వైపు రైతుల దృష్టి పెట్టాలన్నారు.గ్రామసభ అనంతరం రైతు బాలయ్య సాగు చేస్తున్న నిమ్మ తోటను అధికారులు పరిశీలించారు. ఈ సంద ర్భంగా రైతులు సాంప్రదాయ వరి సాగును కొంత తగ్గించి, ఉద్యాన పంటలు మరియు ఆరుతడి పంటల సాగు వైపు మళ్లాలని సూచించారు. దీని వల్ల తక్కువ నీటితో ఎక్కువ లాభాలు పొందవచ్చ ని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లచ్చ య్య, ఉపసర్పంచ్ రమేష్, జీపీఓ స్వామి, పంచా యతీ కార్యదర్శి సత్యవతి, ఫీల్డ్ అసిస్టెంట్ భూమ య్య, వార్డు సభ్యులు శ్రీనివాస్, నవీన్, రైతులు బాలయ్య, లక్ష్మారెడ్డి, శంకర్, భైరయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇస్సన్నపల్లిలో గ్రామసభ… ఫారం పాండ్ల నిర్మాణమే నేటి అవసరం – ఏఈఓ రాకేష్