Sunday, 14 June 2026
  • Home  
  • ఇసుక ట్రాక్టర్ బోల్తా.. వరి పంటకు భారీ నష్టం, 25 ట్రాక్టర్లు బంధించిన రైతులు
- తిరుపతి

ఇసుక ట్రాక్టర్ బోల్తా.. వరి పంటకు భారీ నష్టం, 25 ట్రాక్టర్లు బంధించిన రైతులు

శ్రీకాళహస్తి, జూన్ 13, (పున్నమి న్యూస్) : తొట్టంబేడు మండలం పూడి గ్రామ పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి వరి పొలంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నీటిలో మునిగిపోవడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ప్రతిరోజూ ఇసుక ట్రాక్టర్లు పంట పొలాల గట్ల మీదుగా రాకపోకలు సాగిస్తూ పంటలను దెబ్బతీస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే శ్రీకాళహస్తి–పూడి–పెన్నలపాడు ఆర్‌అండ్‌బీ రహదారి కూడా ఇసుక రవాణా వాహనాల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నదని ఆరోపించారు. ఈ ఘటనపై ఆగ్రహం చెందిన రైతులు, గ్రామస్తులు కలిసి సుమారు 25 ఇసుక లోడ్ ట్రాక్టర్లను అడ్డగించి పూడి జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో బంధించారు. పంట నష్టానికి పూర్తి పరిహారం చెల్లించడంతో పాటు, పొలాల మీదుగా జరుగుతున్న ఇసుక రవాణాను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరుపుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.