*ఆర్థిక లావాదేవీలకు పాన్ తప్పనిసరి.. కేంద్రం కొత్త నిబంధనలు*
ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డును తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది.
రూ.20 లక్షలకు మించిన ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు, రూ.2 లక్షలకు పైబడిన విలువైన ఆస్తులు లేదా సేవల కొనుగోలు, రూ.లక్షకు మించిన షేర్ల అమ్మకం, కొనుగోలు,
రూ.5 లక్షలకు మించిన కారు లేదా బైక్ కొనుగోలు వంటి వాటికి పాన్ తప్పనిసరి.
డీమ్యాట్ ఖాతా తెరవడానికి కూడా పాన్ అవసరం.
పాన్ వివరాలు అందించకపోతే లావాదేవీలు నిలిచిపోతాయి.
తప్పుడు వివరాలు ఇస్తే రూ.10 వేల జరిమానాతో పాటు ఆదాయపు పన్ను శాఖ నుంచి పరిశీలన వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.


