Thursday, 21 May 2026
  • Home  
  • ఆరోగ్యరంగంలో మహిళా వైద్యుల భాగస్వామ్యం పెరగాలి..*
- విశాఖపట్నం

ఆరోగ్యరంగంలో మహిళా వైద్యుల భాగస్వామ్యం పెరగాలి..*

– *ఆరోగ్యరంగంలో మహిళా వైద్యుల భాగస్వామ్యం పెరగాలి..* – *49వ AOMSI వార్షిక కాన్ఫరెన్స్ ను ప్రారంభించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ* ————- *విశాఖపట్నం డిసెంబర్ 11 పున్నమి ప్రతినిధి* విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ రిసార్టులో నిర్వహిస్తున్న AOMSI (Association of Oral & Maxillofacial Surgeons of India) 49వ వార్షిక కాన్ఫరెన్స్ గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా విచ్చేసి దీపప్రజ్వలన, రిబ్బన్ కట్ చేసి కాన్ఫరెన్స్ ను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ శస్త్రచికిత్స రంగంలో భారత వైద్యులు అంతర్జాతీయ స్థాయిలో సాధించిన పురోగతిని ప్రశంసించారు. వైద్య రంగ అభివృద్ధిలో నవీన సాంకేతికత, శాస్త్రీయ పరిశోధన, నైపుణ్య శిక్షణ అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఆరోగ్యరంగంలో మహిళా వైద్యుల భాగస్వామ్యం మరింత పెరగాలని, ప్రోత్సాహ వాతావరణాన్ని సృష్టించడంలో మహిళా కమిషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. AOMSI ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఎల్. కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఈ మూడు రోజుల కాన్ఫరెన్స్‌లో దేశవ్యాప్తంగా వచ్చిన నిపుణ శస్త్రచికిత్స వైద్యులు పాల్గొని లేటెస్ట్ అడ్వాన్స్‌మెంట్స్, క్లినికల్ రీసెర్చ్‌లు, శస్త్ర చికిత్సా పద్ధతులు, మరియు ఆధునిక మెడికల్ టెక్నాలజీలపై చర్చించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు వైద్య నిపుణులు, ప్రతినిధులు, మరియు మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు.

– *ఆరోగ్యరంగంలో మహిళా వైద్యుల భాగస్వామ్యం పెరగాలి..*
– *49వ AOMSI వార్షిక కాన్ఫరెన్స్ ను ప్రారంభించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ*
————-
*విశాఖపట్నం డిసెంబర్ 11 పున్నమి ప్రతినిధి*
విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ రిసార్టులో నిర్వహిస్తున్న AOMSI (Association of Oral & Maxillofacial Surgeons of India) 49వ వార్షిక కాన్ఫరెన్స్ గురువారం లాంఛనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా విచ్చేసి దీపప్రజ్వలన, రిబ్బన్ కట్ చేసి కాన్ఫరెన్స్ ను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ శస్త్రచికిత్స రంగంలో భారత వైద్యులు అంతర్జాతీయ స్థాయిలో సాధించిన పురోగతిని ప్రశంసించారు. వైద్య రంగ అభివృద్ధిలో నవీన సాంకేతికత, శాస్త్రీయ పరిశోధన, నైపుణ్య శిక్షణ అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఆరోగ్యరంగంలో మహిళా వైద్యుల భాగస్వామ్యం మరింత పెరగాలని, ప్రోత్సాహ వాతావరణాన్ని సృష్టించడంలో మహిళా కమిషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.
AOMSI ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఎల్. కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ
ఈ మూడు రోజుల కాన్ఫరెన్స్‌లో దేశవ్యాప్తంగా వచ్చిన నిపుణ శస్త్రచికిత్స వైద్యులు పాల్గొని లేటెస్ట్ అడ్వాన్స్‌మెంట్స్, క్లినికల్ రీసెర్చ్‌లు, శస్త్ర చికిత్సా పద్ధతులు, మరియు ఆధునిక మెడికల్ టెక్నాలజీలపై చర్చించనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో పలువురు వైద్య నిపుణులు, ప్రతినిధులు, మరియు మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.