తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం
అమలాపురం డివిజన్ పరిధిలో వీధి బాలలను కాపాడేందుకు,వారికి భద్రత కల్పించి,విద్యను అందించేందుకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ ఫేజ్ 6 ను ఈరోజు అమలాపురం డీ.యస్.పి షేక్ మాసుం భాషా ప్రారంభించారు.అమలాపురం లో ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా డీఎస్పీ మాసుం భాషా ఆధ్వర్యంలో పట్టణ వీధుల్లో అవగాహన ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా డిఎస్పీ భాషా మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణ కు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఉదయం 11 గంటల తరువాత అన్ని వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయలని వ్యాపారులకు తెలిపారు.రోడ్లపై మాస్కులు ధరించకుండా తిరుగుతున్న యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించి, రోడ్డు ప్రక్కన కరోనా నియంత్రణ ప్లకార్డులను ప్రదర్శింప చేశారు. లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వీధి బాలలను గుర్తించి వారికి విద్యాబుద్ధులు నేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో అమలాపురం రూరల్ సీఐ సురేష్ బాబు,అమలాపురం రూరల్ ఎస్.ఐ రాజేష్,సఖినేటిపల్లి ఎస్ ఐ భవాని మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.