ఖమ్మం మే
(పున్నమి న్యూస్ జిల్లా ప్రతినిధి)
ఖమ్మం నగర కార్పొరేషన్ పరిధిలోని పాత కృష్ణవేణి పాఠశాలకు వెళ్లే మూల మలుపు వద్ద సోమవారం నుండి శనివారం వరకు పరిసరాలు శుభ్రంగా కనిపిస్తున్నాయి. అయితే ఆదివారం వచ్చేసరికి అదే ప్రాంతం చెత్తచెదారాలతో నిండిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతూ, అక్కడి ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. ప్రతి వారం ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని, ఆదివారం రోజున పారిశుద్య కార్మికులు వచ్చి శుభ్రపరిచే పనులు చేయకపోవడమే ఇందుకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
“ఆదివారం పారిశుద్య కార్మికులకు సెలవా..? నగర పరిశుభ్రతపై కార్పొరేషన్ నిర్లక్ష్యం ఎందుకు..?” అంటూ స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


