ఎలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి ఘన స్వాగతం.. ఎమ్మెల్యే భుజం తట్టి ఆత్మీయ పలకరింపు…
~~~~~~~~~~~~~~~~
*అభివృద్ధి బాటలో సత్యవేడు.. సీఎం–ఎమ్మెల్యే ఆత్మీయతకు ప్రతీకగా నిలిచిన దృశ్యం*
~~~~~~~~~~~~~~~~
*తిరుపతి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తిరుపతిలోని ఎలిప్యాడ్ వద్ద సత్యవేడు ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం ఘన స్వాగతం పలికారు.*
~~~~~~~~~~~~~~~~
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారిని ఎమ్మెల్యే ఆదిమూలం ఆత్మీయంగా కలిసి స్వాగతం పలకగా.. సీఎం సైతం ఆయనను ఆప్యాయంగా భుజం తట్టి పలకరించారు.
~~~~~~~~~~~~~~~~
ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఆత్మీయ దృశ్యం అక్కడున్న వారిని విశేషంగా ఆకట్టుకుంది.
~~~~~~~~~~~~~~~
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు–సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మధ్య ఉన్న సాన్నిహిత్యానికి ఈ పలకరింపు ప్రతీకగా నిలిచింది…
~~~~~~~~~~~~~~~~
సీఎం రాక సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం ఉత్సాహంగా స్వాగతం పలకడం.. చంద్రబాబు సైతం… భుజం తట్టి పలకరించడం రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది.
~~~~~~~~~~~~~~~~
సత్యవేడు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి సహకారంతో ముందుకు సాగుతున్న ఆదిమూలానికి ఈ ఆత్మీయ పలకరింపు మరింత ఉత్సాహాన్నిచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
*సీఎం భుజం తట్టారు.. సత్యవేడు గుండెల్లో ఆనందం నింపారు* అన్నట్లుగా నిలిచిన ఈ దృశ్యాలు ప్రస్తుతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


